Friday, April 19, 2024
- Advertisement -

టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మైన మహిళా ఎమ్యెల్యే….

- Advertisement -

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీతోపాటు ఆపార్టీ అధినేత జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాను రాను జ‌గ‌న్‌మీద ఆ పార్టీ నేత‌ల‌కు న‌మ్మ‌కం లేకుండా పోతోంది. అందుకె ఇత‌ర పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నారు. పార్టీ మారె నాయ‌కుల‌ను జ‌గ‌న్ క‌ట్ట‌డి చేయ‌లేక ఇబ్బందులు ప‌డుతున్నారు.

వరుసగా పార్టీ నుంచి ఒక్కొక్కరూ జారిపోతుండడంతో అధినేత జగన్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీలోకి వెళ్లేందుకు అనేకమంది టీడీపీ తో సంప్రదింపులు జరుపుకుంటున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా రంపచోడవరం ఎమ్యెల్యే వి.రాజేశ్వరి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికె ప‌లుమార్లు టీడీపీ నేత‌ల‌తో సంప్ర‌రదింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. తన రాజకీయా గురువు జ్యోతుల నెహ్రూ సలహా సూచనల ప్రకారమే పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ సమస్యల పరిస్కారం కోసం మంత్రి లోకేష్ ను కలిసి నియోజకవర్గ సమస్యల పరిష్కార హామీలతో పాటు టీడీపీలోకి వచ్చే విషయాల గురించి ఆమె స్ప‌ష్టమైన హామీలు పొందినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్ప‌టికే వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఇక ఇప్పుడు రాజేశ్వ‌రి వికెట్ 22వ‌ది అవుతుంది. రాజేశ్వ‌రి విష‌యంలో జగన్ కూడా ఆంటీ ముట్టనట్లు ఉండడంతో పాటు, నియోజక వర్గ సమస్యల గురించి అసెంబ్లీ లో ప్రస్తావించే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేద‌న‌తో ఉన్నారంట‌. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని సైకిల్ ఎక్కేందుకు ఆమె సిద్ధంగా ఉంద‌న్న టాక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -