Monday, May 20, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి మాష్టార్ ప్లాన్

- Advertisement -

రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌రుకు తెలంగాణ తెలుగుదేశం అంటే రేవంత్.రేవంత్ అంటే తెలుగుదేశం అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.తెలంగాణ తెలుగుదేశం టీఆర్ఎస్‌కు ద‌గ్గ‌ర కావ‌డంతో చంద్ర‌బాబుతో విభేదించి ఆయ‌న రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువ క‌ప్పుకోవ‌డం చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి.మాస్ లీడ్‌గా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింది.రేవంత్ రెడ్డి కొడంగ‌ల్ నియోజకవర్గం నుండి ఎమ్మేల్యెగా ప్రాధినిత్యం వహిస్తున్నారు

సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శించే వారిలో రేవంత్ ముందు వ‌రుస‌లో ఉంటారు.రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి రావ‌డాన్ని కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు వ్య‌తిరేకించినప్ప‌టీకి కాంగ్రెస్ ఉప అధ్య‌క్షుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అంత స‌ర్దుమ‌ణిగింది.అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అంత పాద‌యాత్ర చేయ‌ల‌ని ఆలోచ‌న‌తో ఉన్నార‌ని సమాచ‌రం.అయితే దీనికి కాంగ్రెస్ అధిష్ట‌నం నుండి అనుమ‌తి రావ్వ‌ల‌ని అనుమ‌తి ఇవ్వ‌గానే పాద‌యాత్ర ప్రారంభించాల‌ని రేవంత్ ఆలోచిస్తున్నారు. ఈ లోపు పాద‌యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోని అధిష్ట‌నానికి ప‌పించే ప‌నిలో ప‌డ్డారు రేవంత్ రెడ్డి.

అయితే రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కుల ఆలోచ‌న మ‌రోలా ఉంది.నిన్న కాగా మొన్న వ‌చ్చిన రేవంత్ రెడ్డి ఇలా పాద‌యాత్ర చేస్తానటంతో కాంగ్రెస్ నాయ‌కులో గుబులు ప‌ట్టుకుంది.ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్‌లో పాతుకుపోయిన సీనియ‌ర్ నాయ‌కులు రేవంత్ రెడ్డిపై సీరియ‌స్‌గా ఉన్నారు.మ‌హాస‌ముద్రంలాంటి కాంగ్రెస్‌లో రేవంత్ ఒక నీటి బోట్టు మాత్ర‌మేన‌ని వాఖ్య‌నించిన‌ట్లు తెలుస్తుంది.గ‌తంలో ఇలాగే పాద‌యాత్ర ప్ర‌క‌టించి సైలంట్ అయ్యారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.జాన‌రెడ్డి,ఉత్త‌మ్ కుమార్ రెడ్డి,జైపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయ‌కుల మద్య రేవంత్ ఎలా నెగ్గుకోస్తారో చూడాలి.మాస్ చ‌రిష్మా ఉన్నా రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో పాద్ర‌యాత్ర చేస్తే కాంగ్రెస్‌కు లాభం చేకురుతుంద‌ని కాంగ్రెస్ కార్యక‌ర్త‌లు ఆశ‌భావం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -