Friday, April 19, 2024
- Advertisement -

వైసీపీలో పెరిగిన మ‌రింత జోష్‌…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌పై అధికార‌పార్టీ టీడీపీ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌లు అన్నీ ఇన్నీ కావు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ఉనికే కోల్పోతుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రో వైపు వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించి వైసీపీనీ నిర్వేర్యం చేసేందుకు బాబు చేస్తున్న కుటిల రాజ‌కీయాలు తెలిసిందే.

రాయ‌ల‌సీమ‌లో పాద‌యాత్ర ముగించుకొని నెల్లూరు జిల్లాలోకి ప్ర‌వేశించిన మొద‌ట్లోనే టీడీపీకి బిగ్ షాక్ త‌గిలేట‌ట్టుంది. సుళ్లూరుపేటలో వేనాటి వంశం వారసుడు జగన్ పార్టీలోకి జంపవుతున్నాడనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్‌ని కలవడమే కాకుండా మా నాన్నతో చర్చించిన తర్వాత వెళ్లున్నా అని వేనాటి సుమంత్ చెప్పడం సుళ్లూరుపేట టిడిపిలో కలకలం మొద‌ల‌య్యింది.

నెల్లూరు జిల్లాలో వేనాటి మునిరెడ్డి ఆయన తర్వాత వేనాటి రామచంద్రారెడ్డి టిడిపికి భరోసా ఇస్తూ వచ్చారు. అయినా ఆ పార్టీలోని నేతల వరద కారణంగా పదవులకు దూరం కావాల్సి వచ్చిందంటున్నారు. ఇలాంటి స్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కి మళ్లడం మినహా మరో దారి లేదని ముందుగానే తన వారసుడిని ఆ పార్టీలోకి పంపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

జగన్ పథకాలు నచ్చే ఆ పార్టీలోకి వెళ్తున్నా అని ఓపెన్‌గా ఓ అధికార పార్టీ నేతల కుటుంబీకులు చెప్పడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. అందుకే వరస దెబ్బలు పడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కి ఇది పెద్ద రిలీఫ్‌గా చెప్పాలి. అయితే ఈవిష‌యాన్ని టీడీపీనేతుల లైట్ తీసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -