Saturday, April 20, 2024
- Advertisement -

హెరాల్డ్ కేసులో సోనియాపై సానుభూతి చూపిస్తారా ?

- Advertisement -

ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానాన్ని నేషనల్ హెరాల్డ్ కుంభకోణం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీని ఈ కేస్ లో ఈడీ మూడు సార్లు విచారించింది. ఇక ఇప్పుడు సోనియా గాంధీ వంతు వచ్చింది. ప్రస్తుతం జాతీయంగా బీజేపీ కి ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ధృడ నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ సమస్య కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. అయితే కాంగ్రెస్ ను అన్నీ విధాలుగా దెబ్బ తీసేందుకు బిజెపి ప్రభుత్వమే ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇరికించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ..

అయితే కమలనాథులు చెబుతున్నా దాని ప్రకారం.. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణలు జరిగాయని.. అందులో ఈ నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కూడా ఒకటని చెబుతున్నారు. అయితే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దానిపై విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఈ నేషనల్ హెరాల్డ్ కుంభకోణం అనేది.. ఒక వార్తాపత్రిక కు సంభంధించిన షేర్ హోల్డర్ల కేసు.. పైగా ఈ కేస్ పై పెద్దగా ఎవరికి అవగాహన కూడా లేదు. అంతే కాకుండా ఇది ప్రజాధనానికి సంభంధించిన కేసు కూడా కాకపోవడంతో రాహుల్ గాంధీని అలాగే సోనియా గాంధీని ఈ కేసు లో అనవసరంగా ఇరికించే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందనే వాదనను కాంగ్రెస్ నేతలు బలంగా ప్రజల్లోకి తెసుకెల్లే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

అందువల్ల సోనియా గాంధీపై, రాహుల్ గాంధీపై ప్రజల్లో సానుభూతి ఏర్పడే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే నిజంగానే ఈ కేసును సానుభూతిగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా ? అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ కేసును గూర్చిన అవగాహన ప్రజల్లో లేకపోవడం కూడా ఓక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసు విషయంలో సోనియా గాంధీ జులై 21 న ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి అనూహ్యంగా బయటపడిన ఈ కేసు వల్ల కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందా ? లేక సానుభూతిగా మరి లాభం చేకూరుతుందా ? అనేది ఆసక్తికరంగా మారింది.

More Like This

కుల సమీకరణలు చేస్తోన్న మోడి !

ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన బాబు..!

పిల్లలకు అలా.. పెద్దలకు ఇలా .. ఏంటిది జగన్ సారూ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -