Saturday, May 4, 2024
- Advertisement -

కొడెల శివ‌ప్ర‌సాద్‌కు ఈసారి ఓట‌మి త‌ప్ప‌దా?

- Advertisement -

ఆంధ్ర‌ప్రదేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ కొడెల శివ‌ప్ర‌సాద్ రావుకి ఈసారి ఎన్నిక‌ల‌లో ఓట‌మి త‌ప్ప‌దంటున్నారు ఎన్నిక‌ల విశ్లేషకులు. కొడెల శివ‌ప్ర‌సాద్ రావు గుంటురు జిల్లా నుండి ఎమ్మెల్యేగా ప్ర‌తినిథ్యం వ‌హిస్తున్నారు. స‌త్తెన‌ప‌ల్లి నుండి గ‌త ఎన్నిక‌ల‌లో వైఎస్ఆర్ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబుపై విజ‌యం సాధించారు. కొడెల శివ‌ప్ర‌సాద్ రావు టీడీపీ పార్టీలో కీల‌క నాయ‌కుడు పైగా చంద్రబాబుకి న‌మ్మిన బంటు. ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించ‌డంలో కొడెల పాత్ర చాలా ఉంద‌ని, ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అయితే గ‌త ఎన్నిక‌ల‌లో కోట్లు ఖ‌ర్చు పెట్టి తాను ఎమ్మెల్యే అయ్యాన‌ని ఆయ‌నే స్వ‌యంగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు. పైగా ఆయ‌న‌పై నియోజిక వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఎక్కువైంద‌ని స‌మాచారం. కొడెలపై రైతులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలుస్తుంది. కోట్లు ఖ‌ర్చు పెట్టిన త‌క్కువ మెజారిటితో గెలిచిన కొడెల, ఈసారి గెల‌వ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న సొంత పార్టీలోనే చ‌ర్చించుకుంటున్నారు. పైగా సొంత కొడ‌లు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఆయ‌న ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింద‌ని తెలుస్తుంది. అందుకే వ‌చ్చే ఎలెక్ష‌న్స్‌లో ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయ‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇటువంటి పరిస్థితుల‌లో కొడెల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేక సైలెంట్‌గా ఎమ్మెల్సీ ప‌ద‌విని తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -