Tuesday, May 14, 2024
- Advertisement -

టి కాంగ్రెస్ ఆ పని చేస్తుంది.. పోలీసులు ఊరుకునేనా..!!

- Advertisement -

తెలంగాణ లో లేదు అనుకునే స్థాయికి కాంగ్రెస్ పడిపోయినా ఆ పార్టీ లోని కొందరు నాయకులూ తమ ఉనికిని, పార్టీ ఉనికి ని చాటి చెప్పేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం లేకున్నా పార్టీ ప్రెస్ మీటింగ్ లు పెట్టి అధికార పార్టీ ని విమర్శలు చేయడం.. చిన్నవిషయాన్ని భూతద్దంలో పెట్టి వేలెత్తి చూపడం వంటి కార్యకలాపాలతో తమకు ఒరిగేదేమి లేదని తెలిసినా కూడా వారి ప్రయత్నం వారు చేస్తుంటే అధికార పార్టీ సభ్యులు నవ్వుకుంటున్నారు.. ఇంకా తాజాగా వారు ఆసుపత్రుల సందర్శన పేరు తో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించాలని బయల్దేరారు..కరోనా మహమ్మారి విజృంభించి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో…వైద్య సదుపాలను ప్రభుత్వం కల్పించలేకపోయిందని.. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చలేదని అంటున్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో కాంగ్రెస్ నేతలు యాత్ర ప్రారంభించబోతున్నారు.

భద్రాచలం నుంచి ఈ యాత్ర ను పారంభిస్తుండగా వచ్చేనెల ఐదో తేదీ వరకు దాదాపుగా అన్ని జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రులను వారు సందర్శిస్తారట.. నేతలు పర్యటించే అన్ని ప్రాంతాలలోనూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారట..అయితే అసలే అంతర్గత విభేదాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో సీఏల్పీ నేతల పర్యటన కు జిల్లా కాంగ్రెస్ నేతలు సహకరిస్తారా… అనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది.వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఇదే అంశాన్ని అస్త్రం గా చేసుకోవాలని వారు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.. దీనిపై కేసీఆర్,ఏమంటారో, పర్మిషన్ విషయానికొస్తే పోలీసులు ఏమంటారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -