Thursday, April 25, 2024
- Advertisement -

ఏపి అసెంబ్లీలో కరోనా కలకలం!

- Advertisement -

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఏపీని వణికిస్తోంది.  గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ఏపీలో 8.68 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.   ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది.  ఇందులో 8,54,326 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 7,427 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌రావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కారుములి హాజరు అయ్యారు. దాంతో ఇప్పుడు ఆయనను కలిసిన ఎమ్మెల్యేలలో టెన్షన్‌ నెలకొంది. 

నిన్న అసెంబ్లీలో కారుమురి నాగేశ్వరరావు ప్రసంగించారు. కోవిడ్‌ రావడంతో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వర్‌రావు దూరం కానున్నారు. ఆయనకు కలిసిన ఎమ్మెల్యేలు కూడా క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -