Tuesday, April 23, 2024
- Advertisement -

పల్నాడులో టెన్షన్…టెన్షన్ చంద్రబాబు ,లోకేష్ హౌజ్ అరెస్ట్….నిరహారీ దీక్ష

- Advertisement -

టీడీపీ, వైసీపీలు నేడు పోటాపోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. టీడీపీ తలపెట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమంతో పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏంజరుగుతుందోనిని ప్రజలు భయపడుతున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.ఛలో ఆత్మకూరును అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయను ఉండవల్లిలోనూ నివాసంలో హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డ చంద్రబాబు.. తన నివాసంలోనే నిరాహారదీక్షకు దిగారు.. రాత్రి 8 గంటల వరకు తన దీక్ష కొనసాగించనున్నట్టు ప్రకటించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన బాబు ఛలో ఆత్మకూరును అడ్డుకోవడానికి టీడీపీ నేతలను నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. బాధితులకు సంఘీభావంగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలని పిలుపు నిచ్చారు.

పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..? శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా..? అని ప్రశ్నించారు.ఇవాళ ఉదయం 8 గంటలకు దీక్షకు దిగిన చంద్రబాబు.. రాత్రి 8వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.

ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు, పల్నాడుల్లో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 విధించారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలను నిర్వహించడంపై నిషేధం విధించారు.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మీడియాకు కూడా పోలీసులు అనుమతిని నిరాకరించారు.ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు నిరాహారదీక్ష చేపట్టారు. సాయంత్రం 8 గంటల వరకు ఆయన నిరాహారదీక్ష కొనసాగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -