Sunday, May 5, 2024
- Advertisement -

వైఎస్ ష‌ర్మిల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన జేసీ…

- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై మాటల దాడి పెంచారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో టికెట్ కోస‌మో లేకా బాబుగారి మొహంలో చిరున‌వ్వు చూడ‌డానికో కొంద‌రు నేత‌లు భ‌జ‌న చేయ‌డం అలవాటుగా మారింది . సిట్టింగుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని బాబు ప్ర‌క‌టించిన నేథ్యంలో జ‌గ‌న్‌పై మాట‌ల దాడిని ఎక్కుపెట్టారు.

అనంత‌పురంలో జ‌రిగిన ద‌ర్మ‌పోరాట దీక్ష‌లో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న నోటికి ప‌ని చెప్పారు. జ‌గ‌న్‌, ష‌ర్మిల‌ను టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. జ‌గ‌న్ మా వాడు అంటూనే సుతి మెత్త‌గా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

జగన్ కి కుల రాజకీయాలు ఎక్కువ అయ్యాయ‌ని రెడ్డి కులస్తులను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులం పేరుతో ఎవ‌రూ ముఖ్య‌మంత్రి కాలేద‌ని, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జనార్దన్‌రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్ర‌జాద‌ర‌ణ‌తోనే ముఖ్య‌మంత్రులు అయ్యార‌ని.. నీకు ఇంత కుల పిచ్చి ఏంటో త‌న‌కు అర్ధం కావ‌డంలేత‌ని జేసీ అన్నారు. అంత‌టితో ఊరుకోకుండా వైఎస్ ష‌ర్మిల‌పై కూడా దారుణ‌మైన కామెంట్స్ చేశారు.

జ‌గ‌న్ నీ చెల్లి ఏ కుల‌స్తుడిని పెళ్లి చేసుకుంది.. బ్రాహ్మ‌ణుడినే క‌దా.. అయితే పెళ్లి చేసుకునేట‌ప్పుడు అడ్డం రాని కులం, ఓట్లు అడిగేట‌ప్పుడు మాత్రం ఎందుకు వ‌స్తుంది అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో జేసీ దివాకర్రెడ్డి చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయాల కోసం కుటుంబ సభ్యులపై వివాదాస్పదంగా మాట్లాడటం మంచిది కాదని కొంతమంది వైసీపీ నేతలు హిత‌వు ప‌లికారు. బాబు మెప్పు పొంద‌క‌పోతే వ‌చ్చె ఎన్నిక‌ల్లో టికెట్ల ద‌క్క‌వ‌నే ఇ లాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌నే వాద‌న‌లు వినిప‌స్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -