Wednesday, April 24, 2024
- Advertisement -

జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్న టీడీపీ ఎంపీ…

- Advertisement -

నిత్యం ట్విట్టర్ లో జగన్ ను టార్గెట్ చేసె టీడీపీ ఎంపీ చంద్రబాబుకు షాక్ ఇస్తూ మొదటిసారి జగన్ కు జై కొట్టారు.. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉంటూ అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఏదో ఒక లోపం ఉందంటూ ఊదరగొట్టే టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల జరిగిన ఏపిలో ఎన్నికల్లో 175 సీట్లకు 151 సీట్లు గెల్చుకొని భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.

ప్రతిపక్ష నేతలు జగన్ పాలనపై విమర్శలు సాధారనం. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని ఓ సంచలన ట్విట్ చేశారు. బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు.

బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని సమర్ధిస్తూనే జగన్ కు సలహాలిచ్చారు. ఈ పోర్టు నిర్మాణ పనులను తెలంగాణకో, వాన్‌పిక్‌కో లేక ఇతర ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రభుత్వమే ఈ పోర్ట్ పనులను నిర్వహించేలా నిర్ణయం తీసుకోని చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేశినేని నాని జగన్ ను కోరారు.

ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంతో గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసుకుంది. ప్రభుత్వానికి నష్టం కల్గించినందుకు పరిహారం కోరే అవకాశాలను కూడ పరిశీలించాలని ప్రభుత్వం న్యాయ నిపుణులను కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -