Saturday, May 11, 2024
- Advertisement -

లైవ్‌లో బూతులు తిట్టుకున్న టీడీపీ, జ‌న‌సేన

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాల్లో మ‌ల్లెపూల రాజ‌కీయం హాట్ టాఫిక్‌గా మారింది. టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య మ‌ల్లెపూల రాజ‌కీయ వేడి రాసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు పార్టీల నేత‌లు రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేసుక‌న్నారు. ఇప్పుడు లైవ్ డిబేట్‌లో కి ఎక్కింది మ‌ల్లెపూల రాజ‌కీయం. టీడీపీ అధికార ప్ర‌తినిధి యామిని, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు దిలీప్ సుంక‌ర ఇద్ద‌రూ లైవ్‌లో బూతు పురాణానికి తెరతీశారు.

గ‌త కొద్ది రోజులుగా టీడీపీ , జ‌న‌సేన‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయిలో జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధికార‌ప్ర‌తినిధి సాధినేని యామిని ప‌వ‌న్‌పై కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప‌వ‌న్‌కు మ‌ల్లెపూలు న‌ల‌ప‌డం త‌ప్ప రాజ‌కీయం చేత కాద‌ని మ‌ల్లెపూల రాజ‌కీయానికి తెర‌లేపారు. అంతే స్థాయిలో జ‌న‌సేన నేత‌లు కూడా కౌంట‌ర్ ఇచ్చారు.

అయితే ఓ ఛాన‌ల్ లైవ్ డిబేట్‌లో దిలీప్ సుంక‌ర‌, సాధినేని యామిని ఇద్ద‌రూ బూతులు తిట్టుకున్నారు. లైవ్‌లో ఉన్నామ‌న్న విచ‌క్ష‌న‌ను మ‌ర‌చిపోయి ఒక‌రి మీద ఒక‌రు తిట్ల వ‌ర్షం కురిపించుకున్నారు. నీకు సిగ్గుందా? అని ఒకరంటే.. అసలు నీవు ఎవరికి పుట్టావో తెలుసా? అంటూ లైవ్ షో నుండి వాకౌట్ చేశారు. టీడీపీ, జనసేన నాయకుల మధ్య ‘మల్లెపూల’ నేపథ్యంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పొలిటిక‌ల్‌గా కాకుండా వ్య‌క్తిగ‌త దూష‌న‌ల‌కు తెర‌లేపారు.

హామీలతో టీడీపీ అధికారాన్ని చేపట్టిందని.. ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని.. చివరికి రాజధాని నిర్మాణం కూడా చేయలేకపోయిందంటూ విమర్శలు గుప్పించారు దిలీప్ సుంకర. ఆయన వ్యాఖ్యల్ని ఖండించిన యామిని.. ‘200 గజాల్లో మీరు 10 రోజుల్లో ఇళ్లు కట్టుకుని చూపించండి చాలు.. ఇంజనీరింగ్, మున్సిపాలిటీ, ప్లానింగ్ ఇలా అన్నీ చూసుకోవాలంటూ కౌంట‌ర్ ఇచ్చింది. వీళ్ల డిబేట్ ఏమో గాని వీల్ల‌ను చూసిన జ‌నాలు మాత్రం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

మీ ఇంట్లో మీ భార్య లేదా? మీ తల్లి లేదా? ఓ స్త్రీ గురించి ఇలాగే మాట్లాడతారా? మీరు ఎవరికి పుట్టారని నేను మాట్లాడవచ్చా? మల్లెపూలు అంటున్నారు? ఛీ.. ఛీ ఇలాంటి వాళ్లని చర్చలకు పిలుస్తున్నారా? మీ నాయకుడే చెండాలంగా ఉంటే మీరు ఇంతకంటే ఏం మాట్లాడతారంటూ విమ‌ర్శించింది.

జనసైనికుడు దిలీప్ సుంకర శాంతించలేదు. ఒళ్లు బలుపు గిల్లు బలుపు అంటే దవడ పగిలిపోద్ది.. పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకు. నువ్వే మాట్లాడాలి సిగ్గు, శరం గురించి మల్లెపూలు నలిపించుకోవడం గురించి. అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పడం చేతకాదు. నువ్వు మా నాయకుడ్ని విమర్శిస్తావా? అంటూ లైవ్‌లోనే నోటికి పనిచెప్పాడు జనసైనికుడు. ‘మల్లెపూలు’ కామెంట్స్‌కి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటే.. మరోసారి అగ్గి రాజేశారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -