కేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్, ప్రతిపక్ష‌ బీజేపీ పార్టీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. చ‌ట్ట స‌భ స‌భ్యుడుగా కేసీఆర్ పార్ల‌మెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఆరోపించారు. దానికి త‌గిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా బండి సంజ‌య్ స‌మ‌క్షంలో క‌పిల‌వాయి దిలీప్ కుమార్ క‌మ‌ళం కండువా కప్పుకున్నారు. అరాచ‌క టీఆర్ ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. కేసీఆర్ స్వార్థ రాజ‌కీయాల కోసం దివంగ‌త నేత‌ల పేర్ల‌ను వాడుకుంటున్నార‌ని విమ‌ర్శంచారు. ఈ క్ర‌మంలోనే త‌న రాజ‌కీయ మ‌నుగ‌డ కోసం మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీని ఉప‌యోగించుకుంటున్నార‌న్నారు. న్యాయ‌వాది వామ‌న్ రావు హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.

- Advertisement -

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లోక్‌సభ స‌భ్యులుగా ఉన్న స‌మ‌యంలో పార్ల‌మెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌నీ, దీనిని త‌గిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని బండి సంజ‌య్ మీడియాతో వెల్ల‌డించార‌. ఈ బండారాన్ని త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌ముందు ఉంచుతాన‌ని తెలిపారు. స్పీక‌ర్ అనుమతి కోసం చూస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఈ విష‌యం చ‌ట్ట స‌భ‌ల‌ను కుదిపేసే అంశ‌మ‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -