Friday, April 19, 2024
- Advertisement -

“గడప గడపకు ” జగన్ కు సమస్యేనా ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలపై గట్టిగానే దృష్టి సాధించింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయాన్ని నమోదు చేసిన వైసీపీ.. ఈ సారి వచ్చే ఎన్నికల్లో అంతకు మించి అన్నట్లుగా వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు, అధికార ప్రతినిధులకు కూడా దిశానిర్దేశం కూడా చేశారు వైఎస్ జగన్. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు కైవసం చేసుకోవడమే టార్గెట్ అంటూ జగన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ” గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సి‌ఎం జగన్.

ఈ కార్యక్రమంలో జిల్లాల్లోని ఎం‌పిలు, ఎమ్మేల్యేలు, పార్టీ ప్రతినిధులు, పార్టీ కార్య కర్తలు ఇలా అందరూ కూడా గ్రామాల్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి వివరించడంతో పాటు, ప్రభుత్వం పై ఉన్న అభిప్రాయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. అయితే ఓట్లకు ముందు కనిపించిన ఎమ్మేల్యేలు మళ్ళీ ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తుండడంతో పరిష్కారం కానీ సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ మద్య ఓ మహిళా “గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పై బూతులు తిడుతూ తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆవిధంగా చాలా చోట్ల ప్రజలు గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత చూపుతున్నారు.

ఈ విధంగా ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత జగన్ కు సమస్యగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొనడం లేదనే వార్తలు బలంగా వస్తున్నాయి, కొడాలి నాని, పెర్ని నాని, ఇలా చాలమంది మాజీ మంత్రులు వారి నియోజిక వర్గాలలో ” గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకులే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోక పోవడంతో ఇది కూడా జగన్ కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి “గడప గడపకు పభుత్వం ” కార్యక్రమం..వల్ల జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఎమ్మెల్యేలపై, ఆ పార్టీ శ్రేణులపై గట్టిగానే చూపిస్తున్నారని ఇతర పార్టీల వాళ్ళు చెబుతున్నారు.

More Like This

కర్నూలులో హైకోర్టు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం !

కే‌సి‌ఆర్ ను ప్రజలు నమ్మడం లేదా ?

చంద్రబాబు కు షాక్ ఇస్తున్న సొంత పార్టీ నేతలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -