Monday, May 6, 2024
- Advertisement -

ప్రీ పోల్ స‌ర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే…?

- Advertisement -

వ‌చ్చే ఎన్కిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నే దానిపై తెలుగు రాష్ట్రాల్లో స‌ర్వేలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని…జ‌గ‌న్ సీఎం అవుతార‌ని ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా మీడియా సంస్ధ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కే ప‌ట్టం క‌డ‌తార‌ని తేలింది. జగన్‌మోహన్‌రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు.

ఇక తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ స‌ర్వేలో సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌రోసారి సీఎంగా కేసీఆర్‌ను ప్ర‌జ‌లు చూడాల‌నుకుంటున్నార‌ని స‌ర్వేలో స్ప‌ష్టం తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు 80 స్థానాలు, కాంగ్రెస్‌కు 20, ఎంఐఎంకు 8, బీజేపీకి 7, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని ఈ సర్వే చెప్పింది.

ఓటింగ్ శాతాల పరంగా చూస్తే.. టీఆర్‌ఎస్‌కు 41శాతం ఓటింగ్, కాంగ్రెస్‌కు 27శాతం, బీజేపీకి 10 శాతం, ఎంఐఎంకు 6 శాతం, టీడీపీకి 4 శాతం, సీపీఐకి 2 శాతం, టీజేఎస్‌కు 2 శాతం, వైసీపీకి 1 శాతం, సీపీఎంకు 1 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే అంచనా వేసింది. అయితే ఎవ‌రికి ఓటు వేయాల‌ని నిర్ణ‌యించుకోని వారు మూడు శాతం ఉన్నార‌ని తెలిసింది.

సర్వేకోసం తెలంగాణను గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణగా వీడీపీ అసోసియేట్స్. విభజించింది. టీఆర్‌ఎస్‌కు గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 42 శాతం, ఉత్తర తెలంగాణలో 41 శాతం, దక్షిణ తెలంగాణలో 39 శాతం ఓట్లు లభిస్తాయని అంచనావేసింది. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే తదుపరి ముఖ్యమంత్రి కావాలని 51 శాతం ఓటర్లు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నూటికి పది మంది మాత్రమే ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం కావాలని 6 శాతం, కోదండరాం సీఎం కావాలని 4 శాతం మంది కోరుకుంటున్నట్లు ప్రీ పోల్ సర్వేలో తేలింది. ఈ స‌ర్వే ఫ‌లితాలు టీఆర్ఎస్‌కు బూస్ట్ ఇవ్వ‌డంతో పాటు ప్ర‌తిప‌క్షాల‌కు షాక్ ఇచ్చాయి. స‌ర్వే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌రింత దూసుకుపోనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -