Friday, May 3, 2024
- Advertisement -

టీపీసీసీ ప్రకటన .. కొన్ని గంటల్లోనే

- Advertisement -

మరికొన్ని గంటల్లోనే టీపీసీసీ ఎవరు? అనే విషయం తేలిపోనున్నట్టు సమాచారం. చాలా రోజులుగా వివిధ కారణాలతో పీసీసీ అధ్యక్ష పదవి పెండింగ్​లో పడిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కసరత్తుల అనంతరం కాంగ్రెస్​ హైకమాండ్​ ఓ నిర్ణయానికి వచ్చిందట. సోమవారం రాత్రి వరకు ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ పదవి కోసం కాంగ్రెస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి, సీనియర్​ కాంగ్రెస్​ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే వీళ్లిద్దరూ ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.

మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మరో కాంగ్రెస్​ నేత మధు యాష్కి గౌడ్​ సైతం ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వబోతున్నారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఎవరికి వారు తమ స్థాయిలో లాబియింగ్​ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల అనూహ్యంగా మధుయాష్కి గౌడ్​ పేరు తెరమీదకు వచ్చింది. మధు యాష్కి బీసీ కార్డు ప్రయోగిస్తున్నట్టు సమాచారం.

Also Read: ఏపీలో పరీక్షలు ఉంటాయా? ఉండవా? మంత్రి క్లారిటీ..!

అయితే అధిష్ఠానం మాత్రం రేవంత్​రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఆయన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. మరో కీలక నేత కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తన స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఆయనను కాంగ్రెస్​ హైకమాండ్​ బుజ్జగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు నుంచి రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్​ అర్జెంట్​గా ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం పీసీసీ అధ్యక్ష ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Also Read: ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -