గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

- Advertisement -

గుడ్డు (ఎగ్) పోష‌కాల గ‌ని అని ఇప్ప‌టికే చాలా మంది ప‌రిశోధ‌కులు, నిపుణులు త‌మ ప‌రిశోధ‌నల ద్వారా వెల్ల‌డించారు. అందుకే పిల్ల‌ల‌కు, గ‌ర్భ‌ణుల‌కు, వీక్ గా ఉన్న‌వారికి కోడి గుడ్డు తినాల‌ని వైద్యులు స‌ల‌హాలిస్తుంటారు. పిల్ల‌లు వ‌య‌స్సుకు త‌గినంత బ‌రువు పెర‌గ‌డం లేదంటే వారు నిత్యం రెండు గుడ్లు ఆహారంతో పాటు తీసుకుంటే మంచి ఫ‌లితాలుంటాయ‌ని చెబుతున్నారు.

తాజాగా గుడ్డు తిన‌డం వ‌ల్ల మ‌రో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నం ఉంద‌ని మ‌రో ప‌రిశోధ‌న అధ్య‌య‌నం పేర్కొంది. కోడి గుడ్డును తిన‌డం ద్వారా ఊబకాయులు బరువు త‌గ్గించుకోవ‌చ్చున‌ని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఒబేసిటీ, అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ సర్వేలు వెల్ల‌డించాయి. అయితే, దీని కోసం కోడిగుడ్డునే తీసుకునే విధానంలో కొద్దిగా ప్ర‌ణాళిక‌ను మార్చుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

- Advertisement -

గుడ్డును ఉడకబెట్టి, ఆమ్లెట్‌ రూపంలో, కూరగాయాలతో కలిపి ఆహారంగా తీసుకోవాల‌ని సూచించింది. ఇంటర్నేషన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఒబేసిటీ 152 మంది అధిక బరువున్న వ్యక్తులకు ఎనిమిది వారాల పాటు రోజూ ఉదయం రెండు గుడ్లను ఆహారంగా అందించింది ప‌రిశోధన సాగించింది. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ సర్వే ప్రకారం 43 మంది అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకున్నప్పటికంటే నిత్యం రెండు కోడిగుడ్లు తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసింద‌ని వివ‌రించింది.

ఘోర ప్ర‌మాదం.. 55 మంది దుర్మ‌ర‌ణం

రాత్రి నిద్రపోయే టైంలో ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

సమ్మర్ స్పెషల్: సోంపు గింజల కూల్ డ్రింక్.. ప్రయోజనాలెన్నో !

కరోనా కల్లోలం.. మూడో సారి లాక్‌డౌన్.. !

అద‌ర‌గొడుతూ.. దూసుకుపోతున్న అందాల నిధి

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -