Friday, April 19, 2024
- Advertisement -

దారుణం.. గోదావరిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!

- Advertisement -

కాలం కలిసి రాకుంటే కర్రే పాము అయి కాటేస్తుందని అంటారు.. చావు అనేది ఏ మూల నుంచి తరుముకు వస్తుందో తెలియదు. నిజామాబాద్ జిల్లాలో పోచంపహాడ్ గోదావరిలో నీట మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ పోచంపాడ్ గ్రామంలోని గోదావరి పుష్కరఘాట్ గంగమ్మతల్లికి పుట్టు వెంట్రుకలు సమర్పించడానికి కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులు కూడా వచ్చారు. ఉదయం 10 గంటలకు గోదావరి నది విఐపీ పుష్కరఘాట్‌కు చేరుకున్నారు.

ముందుగా శ్రీకర్, సిద్ధార్థ, రవికాంత్, యోగేష్, నీటివద్దకు ఆటలాడుతుండగా ప్రవాహానికి పిల్లలు కొట్టకుపోతున్నారని అక్కడే ఉన్న సురేష్, శ్రీనివాస్, రాజులు వారిని కాపాడుట కోసం నీటిలోకి వెళ్ళారు. అక్కడ ప్రవాహానికి కొట్టుకు పోయారు. రవికాంత్ మాత్రం నీటిలో మునుగుతూ తేలుతూ స్థానికులకు కనపడటంతో ఇడగొట్టి రాజు గోదావరిలోకి ఈతకొడుతూ వెళ్ళి రవికాంత్‌ను కాపాడారు.

అయితే కొట్టుకు పోయేవారిని రక్షించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. గోదావరి నదికి వచ్చిన భక్తులు విషాదంలో మునిగి పోయారు. అక్కడ ఉన్న అందరూ కన్నీరు మున్నీరయ్యారు. గోదావరి నదితీరం రోధనలతో తడిసిపోయింది. గోదావరి నది విఐపి ఘాట్ వద్ద జరిగిన విషాధ సంఘటన పరిశీలించేందుకు అడీషనల్ డిసిపి రఘువీర్, ఎసిపి రఘు, సిఐ విజయ్‌కుమార్, తహశీల్దార్ జనార్ధన్‌లు సంఘటన స్థలా న్ని పరిశీలించారు.

ఘోర ప్ర‌మాదం.. 55 మంది దుర్మ‌ర‌ణం

అసోంలో బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం తరలింపు.. నలుగురు ఈసీ అధికారులపై వేటు!

‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ కళ్యాన్ పోరాటాలు.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -