తెలంగాణలో మునుగోడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలు గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నాయి. టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు మునుగోడు విజయం అత్యంత కీలకం కావడంతో ఈ బైపోల్ అత్యంత రసవత్తరంగా మారింది. ఇప్పటికే నెలకొన్న ఈ త్రిముఖ పోరులో టీడీపీ కూడా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ గత వారంరోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపించాయి. టిటిడిపి నేతలు కూడా మునుగోడు పోటీలో నిలిచేందుకు గట్టిగానే ఆసక్తి కనబరిచారు. చంద్రబాబు కూడా మునుగోడు బరిలో టీడీపీని నిలిపేందుకు సిద్దంగానే ఉన్నారని బీసీ వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపించాయి.
అయితే హటాత్తుగా మునుగోడు బరి నుంచి టీడీపీ తప్పుకుంది.. మునుగోడు ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయడం లేదని టీటీడీపీ చీఫ్ బక్కని నరసింహులు ప్రకటన ద్వారా తెలిపారు. నాయకులతోనూ, కార్యకర్తలతోనూ అన్నీ విషయాలు కులాంకుశంగా చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే నిన్న మొన్నటి వరకు పోటీకి సై అన్న టీడీపీ హటాత్తుగా ఎందుకు పోటీ నుంచి వెనుకడుగు వేసింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పక్కా ప్రణాళిక బద్దంగానే చంద్రబాబు మునుగోడు బైపోల్ కు దూరంగా నిలిచారనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తుకు సై అనే అవకాశాలు ఉన్నాయి.
ఈ మద్యకాలంలో చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలతో సానుకూల వైఖరిని కనబరుస్తున్నారు. దాంతో 2014 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్టతకంగా తీసుకుంది. దాంతో మునుగోడు బరిలో టీడీపీ కూడా నిలిస్తే ఓటు బ్యాంకు చీలి కాంగ్రెస్ కు లేదా టిఆర్‌ఎస్ కు కలిసొచ్చే అవకాశం ఉందని.. అందుకే బీజేపీ మునుగోడు రేస్ లో విజయకేతనం ఎగురవేయాలంటే.. టీడీపీ పోటీ నుంచి విరమించుకోవడమే ఉత్తమమని చంద్రబాబు భావించినట్లు సమాచారం. అందుకే మిత్రపక్షనికి లైన్ క్లియర్ చేసేందుకే టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నాట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
అభివృద్ది పేరుతో దోచేస్తారా.. జగన్ సార్ ?
