Sunday, May 5, 2024
- Advertisement -

అన్న.. అన్న.. అన్న.. ఈ ఆటోకు దారివ్వండన్నా..ఆటోను ఇబ్బంది పెట్ట‌ద్ద‌న్నా.

- Advertisement -

రాజ‌కీయ నాయ‌కులు బ‌హిరంగ స‌భ‌లు పెట్టిన‌పుడు ఉప‌న్యాసాలు దంచేస్తుంటారు. ఇక చంద్ర‌బాబు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌నాలు ఏమైనా ప‌ర్వాలేదు నాకేంటి నైజం బాబుది. కాని జ‌గ‌న్ అలాంటి నాయ‌కుడు కాదు.ప్రజల మంచి కోరే ఈ నేత మరోసారి తమ మంచితనాన్ని చాటుకున్నారు. ఓ నిండు గ‌ర్భిని కోసం జ‌గ‌న్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అవ‌తారం ఎత్తారు.

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొన‌సాగుతోంది. నెల్లిమర్లలోని మొయిద జంక్షన్‌.. బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ జరుగుతోంది. కిక్కిరిసిన జనం.. అడుగేయడమే కష్టం.. మరో వైపు జననేత ఉద్విగ్నభరిత ప్రసంగం సాగుతోంది.అలాంటి జనసునామీ మధ్య ఇరుక్కుంది ఓ ఆటో. అందులో ఓ నిండు గర్భిణి.

జగన్ స్పీచ్ స్టార్ట్ చేశారు. అతనికి ఈ విషయం తెలీదు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎలాగోలా మెల్లగా విషయం జగన్ వరకు వెళ్లింది. జనసంద్రం మధ్యలో ఆటో చిక్కుకుపోయిందని తెలుసుకున్న జగన్ ఓ క్షణం నివ్వెరపోయారు. ఆ వెంటనే తన ప్రసంగం ఆపేశారు. ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తారు.

అన్న.. అన్న.. అన్న.. ఈ ఆటోకు దారివ్వండన్నా.. అన్న.. అన్న.. ఆటోకి ఇబ్బంది పెట్టొద్దన్నా అంటూ జ‌గ‌న్ చేసిన విజ్ణ‌ప్తికి అక్క‌డున్న ప్ర‌జ‌లు స్పందించారు. ఇలా స్వయంగా జగన్ తన బహిరంగ సభను పక్కనపెట్టి గర్భిణి ప్రయాణిస్తున్న ఆటోకు దారి ఇచ్చేలా చేశారు.

ఆ క్షణంలో జగన్‌ మాట్లాడుతూ ‘108 రాక ఆ గర్భిణీ కనీసం ఆటోలో వెళ్తుంది. కొంచెం స్థలం ఇవ్వాలన్నా.. కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. మిమ్మల్నందరినీ కోరుతున్నా. ఇదే నెల్లిమర్లలో ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆటోలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే 108కి ఫోన్‌ కొడితే 20 నిముషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ కుయ్‌.. కుయ్‌ అనే సౌండ్‌ వినపడటం లేదంటే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటో వేరే చెప్పక్కర్లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఆరోగ్యం ఎలా ప‌డ‌కేసిందో ఇదో ఉదాహ‌ర‌ణ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -