Thursday, April 18, 2024
- Advertisement -

జగన్ నెక్స్ట్ లెవల్ పబ్లిసిటీ.. విజయ్ దేవరకొండ కు పట్టిన గతే పడుతుందా ?

- Advertisement -

పబ్లిసిటీ విషయంలో వైఎస్ జగన్ రూటే సపరేటు.. గత ఎన్నికల్లో ” రావాలి జగన్.. కావాలి జగన్ ” అనే నినాదంతో ప్రజల్లో గట్టిగా చొచ్చుకొని పోయి ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకొని ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు వైఎస్ జగన్.. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా జగన్ పబ్లిసిటీ ఏమాత్రం తగ్గలేదు. ఆయన ప్రవేశ పెడుతున్న పథకాలు నిత్యం ప్రజల్లో నానే విధంగా గ్రామస్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలతో వైసీపీ శ్రేణులు చేస్తున్న హంగామా ఏ స్థాయిలో ఉందో రోజు మనం చూస్తూనే ఉన్నాం.. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా పబ్లిసిటీ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వైసీపీ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని వైఎస్ జగన్ టార్గెట్ పెట్టుకున్నట్లు పదే పదే చెబుతున్నారు. మరి అది సాధ్యమేనా అనే విషయం కాస్త పక్కన పెడితే.. ” 175 స్థానాల్లో వైసీపీ.. ” అనే దాన్ని మాత్రం ప్రజల్లో బలంగా పబ్లిసిటీ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుపు కుప్పంతోనే ప్రారంభం కావాలని.. జగన్ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే కుప్పంలో వైసీపీ పాగా వేయడం అంతా సులభం కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఎందుకంటే కుప్పం నియోజిక వర్గం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కంచుకోట.. అక్కడ చంద్రబాబు ను ఢీ కొట్టి నిలబడే నాయకుడు కనిచూపు మేరలో కనిపించరు. మరి అలాంటి కుప్పంలో బాబును ఢీ కొట్టి వైసీపీ నిలబడుతుందా అంటే సమాధానం చెప్పడం కష్టమే.. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంతమేర విజయం సాధిస్తుందో తెలియదు గాని.. ప్రస్తుతం కుప్పం లో ఎక్కడ చూసిన ” టార్గెట్ కుప్పం ” , ” we will win 175 “.. అని కనిపిస్తున్నాయి.

అయితే జగన్ చేస్తున్న ఈ ఓవర్ పబ్లిసిటీపై కొందరు సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు.. జగన్ పబ్లిసిటీని విజయ్ దేవరకొండ పబ్లిసిటీతో పోలుస్తూ సెటైర్స్ వేస్తున్నారు.. లైగర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన పబ్లిసిటీ ఏ స్థాయిలో వివాదం అయిందో అందరికీ తెలిసిందే.. ” ఇండియాను షేక్ చేస్తా.. ఆగ్ లగా దెంఘే ” అంటూ విజయ్ చేసిన ఓవర్ పబ్లిసిటీ అందరికీ తెలిసిందే.. తీర సినిమా విడుదల తరువాత డిజాస్టర్ గా నిలిచింది. అదే విధంగా జగన్ కూడా ” 175 స్థానాల్లో విజయం సాధిస్తాం.. అది కూడా కుప్పం నుంచే సాధిస్తాం ” అంటూ ఓవర్ పబ్లిసిటీ చేస్తున్నారు. దాంతో విజయ్ మాదిరిగానే జగన్ కూడా ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తారని..కొందరు నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ పబ్లిసిటీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Also Read

సీనియర్స్ పని అయిపోయినట్లేనా ?

మోడీ పర్వతం.. అయిన ఢీ కొట్టేందుకు మేము సిద్దం !

ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ.. తెరవెనుక తతంగం ఎవరిది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -