Friday, March 29, 2024
- Advertisement -

నిరుద్యోగులకు అర చేతిలో వైకుంఠం చూపి 6 నెలలు.. ఇంకా ఎప్పుడు? : వైఎస్ షర్మిల

- Advertisement -

తెలంగాణ వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు మాకే వస్తాయని ఎంతో మంది యువత వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. 60 ఏళ్ల పోరాటం.. ఎంతో మంది అమరవీరుల త్యాగఫలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగాల జాతర ఉంటుందని ఎంతో మంది నిరుద్యోగులు భావించారు.. కానీ ఉద్యోగాల నోటిఫికేషన్ లేక ఆత్మహత్యలు చేసుకునే దారుణమైన పరిస్థితి నెలకొందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ‌లో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామ‌ని, వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలున్నట్టు అంచనా వేశామ‌ని గత ఏడాది డిసెంబర్‌ 13న సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశార‌ని.. కానీ ఇప్పటి వరకు అతీ గతీ లేదని ఓ వార్త‌ను వైఎస్ ష‌ర్మిల పోస్ట్ చేశారు.

త్వరలో.. త్వరలో.. త్వరలో.. 50 వేల పోస్ట్లు అని.. అర చేతిలో వైకుంఠం చూపి 6 నెలలు గడిచిపోయింది .. అయినా అడుగు ముందుకు పడింది లేదు, KCR సారుకు గిట్టని నాయకుల మీద కంప్లైంట్ వచ్చుడే ఆలస్యం.. అరక్షణంలో స్పందిస్తరు.. అధికార యంత్రంగానంతా కదిలిస్తరు.

ఉద్యోగ నోటిఫికెషన్స్ ఇవ్వండని నిరుద్యోగులు చనిపోతున్న KCR సారు స్పందించరు, 50 వేల పోస్టులను కాదు .. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను నింపాల్సిందే అంటూ ఆమో తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. డిమాండ్ చేశారు.

Also Read

ఏపీలో కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే..!

కేసీఆర్ సారు.. రైతులు చావే దిక్కంటున్నారు : వైఎస్ షర్మిల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -