Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీలో కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే..!

- Advertisement -

ఏపీలో మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా చాన్స్​ వచ్చింది. ఏపీ ప్రభుత్వం గవర్నర్​ కోటాలో నలుగురు పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్​ బిష్వభూషణ్​ అందుకు ఆమోదం తెలిపారు. సోమవారం ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి.. గవర్నర్​తో సమావేశమయ్యారు. వీరిద్దరూ సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు సీఎం జగన్​ గవర్నర్​ కోటా కింద.. మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, లెల్ల అప్పిరెడ్డి పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్​ అందుకు ఆమోద ముద్ర వేశారు.

గతంలో గవర్నర్ కోటాలో ఎన్నికైన టీడీ జనార్దన్, బీద రవిచంద్ర, గౌనిగారి శ్రీనివాస్, పి.శమంతకమణి పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. నామినేటెడ్​ పోస్టుల ఎంపికలో సీఎం జగన్​.. సామాజిక న్యాయం పాటించారు.ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోషెన్​రాజు, కాపు సామాజికవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు, బీసీ వర్గానికి చెందిన రమేశ్​ యాదవ్​, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అప్పిరెడ్డి ల పేర్లను ఆయన ప్రతిపాదించారు.

నిజానికి మండలిలో టీడీపీ బలం ఉంది. ఈ క్రమంలో పలు బిల్లులు అక్కడ పెండింగ్​లో పడుతున్నాయి. దీంతో ఓ దశలో మండలిని రద్దు చేయాలని సీఎం జగన్​ భావించారు. అందుకోసం ఏకంగా శాసనసభలో తీర్మానం చేసి.. పార్లమెంటుకు పంపారు. అది కేంద్రం పరిధిలో పెండింగ్​లో ఉంది. అయితే ప్రస్తుతం సీఎం జగన్​ ఈ విషయంలో మనసు మార్చుకున్నట్టు సమాచారం. ఎందుకంటే వైసీపీ లో చాలా మంది ఆశావహులు ఉన్నారు. వారంతా పదవులు ఆశిస్తున్నారు. దాంతో పాటు త్వరలో మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరగనుంది. దీంతో మండలిని కొనసాగించాలని జగన్​ యోచిస్తున్నట్టు సమాచారం.

Also Read

ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

తమిళనాట చిన్నమ్మ ప్రకంపనలు.. నన్ను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరు..!

తారక్​ పొలిటికల్​ ఎంట్రీపై బాలయ్య రియాక్షన్​ ఇదే..! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -