- Advertisement -

స‌ర్వేల మ‌త్తులో మునిగితేలుతున్న వైసీపీ…?

- Advertisement -

ప్ర‌స్తుతం ఏపీలో ఏ స‌ర్వేలు చూసుకున్న వైసీపీ ప్ర‌భంజ‌న‌మే కొన‌సాగుతోంది. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం త‌ధ్యం అని స‌ర్వేలు కోడై కూస్తున్నాయి. ఎన్నిక‌ల ముందు స‌ర్వేలు మామూలే. ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను చూసుకొని మురిసిపోతే విజ‌యం ద‌గ్గ‌ర బొక్క బోర్లా ప‌డాల్సిందే. ఈ స‌ర్వే దెబ్బ ఇప్ప‌టికే వైసీపీ రుచి చూసింది. 2014 ఎన్నిక‌ల్లో కూడా స‌ర్వేల‌తో మురిసిపోయిన పార్టీ చివ‌ర‌కు విజ‌యం ద‌గ్గ‌ర బొక్క బోర్లా ప‌డింది.

తాజాగా రిప‌బ్లిక్ టీవీ త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ళ చేసింది. ఈ ఫలితాల్లో వైపీపీ 19 ఎంపీ సీట్లు సాధిస్తుంద‌ని తేలింది. ఇది ఒక విధంగా వైసీపీకీ బూస్ట్ అన‌డంలో సందేహంలేదు. స‌ర్వే ఫ‌లితాల‌ను చూసి మురిసిపోతే…మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయి.

అస‌లు విష‌యానికి వ‌స్తే…. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీనుంచి పార్ల‌మెంట్ స్థానాల‌కు పోటీ చేసే అభ్య‌ర్త‌ల ఎంపిక ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే ఉంది. జ‌గ‌న్ సొంత జిల్లాలో కూడా ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే స్థాయిలో కూడా వైసీపీ పార్టీ లేదు. దాంతో పాటు అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలో కూడా ప‌రిస్థితే అలాగే ఉంది.

19 ఎంపీ స్థానాలు గెల‌వాలంటే అంత ఈజీ కాదు. టీడీపీ త‌రుపున పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల‌ను ఢీ కొట్టే స‌త్తా వైసీపీ నేత‌ల‌కు లేద‌నే చెప్పాలి. మరో ఆరువారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్ప‌టి క‌ల్లా స‌ర్వేల ఫ‌లితాలు మారి పోవ‌చ్చు. ఈ సర్వేల మత్తులో మనుగడం వైకాపాకు కొత్త ఏమీకాదు. స‌ర్వేల‌న్ని మాకు అనుకూలంగా ఉన్నాయి అనుకొని విర్ర‌వీగుతే మాత్రం మ‌రో సారి ప్ర‌తిప‌క్షంలో వైసీపీ కూర్చోవాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -