Saturday, May 11, 2024
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నిక‌పై డైలమాలో వైసీపీ……

- Advertisement -

కర్నూలు ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి అధినేత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని సోమవారం సాయంత్రం పార్టీ సీనియర్ నేతల సమావేశంలో జగన్ నిర్ణయించారు. పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయం చాలా మంది నేతలకు మింగుడు పడటం లేదు. పోటీ నుండి విరమించుకోవటం సరైన చర్య కాదని పలువురు నేతలు అభిప్రాయపడతున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పోటీనుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వైసీపీ ప్ర‌క‌టించింది. అయితే, పోటీలో నిలబడతానని, పార్టీ తరపున నామినేషన్ వేస్తానంటూ ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి పట్టుబడుతున్నారు. తన వెనుక 1,080 మంది స్థానిక సంస్థల ప్రతినిధుల బలం ఉందని, తాను గెలిచే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో, జగన్ తో ఈ విషయంపై చర్చించేందుకు ఆయన గార్లపెంట చేరుకున్నారు. తన దగ్గరున్న లెక్కలను జగన్ కు చూపించి, ఎన్నికల బరిలో దిగేందుకు ఒప్పించాలని గౌరు ప్రయత్నిస్తున్నారు.

గౌరు ప్రతిపాదనను జగన్ ఎంతవరకు ఒప్పుకుంటారనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. మరోవైపు, జగన్ ఒప్పుకోకపోతే… ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు కూడా గౌరు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో, వైసీపీలో పూర్తి స్థాయిలో డైలమా నెలకొంది. కాపేసట్లో ఈ విషయానికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు ఈ సాయంత్రం 5 గంటలు కావడంతో పార్టీ అయోమ‌యం నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -