Sunday, April 28, 2024
- Advertisement -

వైసీపీ లో క్రాస్ ఓటింగ్‌.. జగన్ కి బిగ్ షాక్..

- Advertisement -

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనం నమోదైందా.. వైసీపీ నుంచి ఏదైనా క్రాస్ ఓటింగ్‌ జరిగిందా.. తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయంతో జగన్‌ గుండెల్లో భయం మొదలైందా.. టీడీపీలో 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కాని అనురాధకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు ఎవరు.. 151 ఎమ్మెల్యేల భలంతో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్సీ సీటును ఎలా పొగొట్టుకుంది.

సాధారణ ఎన్నికల ముందు అధికార వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. టీడీపీకి 19 మంది సభ్యుల భలం ఉండగా.. అనురాధకు 23 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన ఏకైక టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపొందినట్లైంది. కాగా వైసీపీలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డది ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

మరోవైపు పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో వైసీపీలో ఓటమి పాలయ్యే నాయకుడు ఎవరనే దానిపై ఉత్కంఠగా మారింది. ఎన్నికలకు ముందే సీఎం జగన్‌ వైసీపీ సభ్యులను ఇతర పార్టీల అభ్యర్థుల వైపు వెళ్లకుండా చూసుకున్నారు. అయినా కొందరు నేతలు మాత్రం అధిష్టానం చెప్పినవి పట్టించుకోకుండా టీడీపీ అభ్యర్ధికి ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ పై అసంతృప్తిగా ఉన్న నేతలే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -