- Advertisement -

ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు వాడ‌ని సరికొత్త పద ప్రయోగం చేసిన జ‌గ‌న్‌

- Advertisement -

కొద్దిరోజులుగా రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన జ‌గ‌న్ చేప‌డుతున్న ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు మొద‌టి అడుగు ప‌డింది. ఇడుపుల పాయ‌లో తండ్రి స‌మాధివ‌ద్ద నివాళుల‌ర్పించి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. గ‌తంలో ప్ర‌ద‌ర్శించిన మాట‌ల తూటాల‌ను ఇక్క‌డ పేల్చారు. అయితె ప్ర‌సంగంలో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ వాడ‌ని కొత్త క‌సి అనే ప‌దాన్ని ప్ర‌యేగించారు. కున్న కసి ఏమిటో తెలుసా.?’ అంటూ కొత్త పంథాలో వైఎస్‌ జగన్‌, ప్రసంగాన్నిఅద‌ర‌గొట్టేశారు.

మాస్ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌లంటె వారికి అర్థ‌మ‌య్యే ప‌దాల‌ను వాడాలి. మాస్‌.. పక్కా మాస్‌.. ఊరమాస్‌.. అనే తరహాలో జగన్‌ ప్రసంగంలో పదే పదే ‘కసి’ అన్న పదాన్ని ప్రయోగించేశారు. బ‌హుశ ఇప్ప‌ట వ‌ర‌కు ఎవ‌రూ ప్ర‌యేగించ‌ని కొత్త ప‌ద ప్ర‌యోగం అనుకోవాలి. ఏరాజ‌కీయ నాయ‌కులుకూడా ‘కసి’ అన్న పదాన్ని జగన్‌ తప్ప, ఇంకెవరూ ఉపయోగించి ఉండ‌రేమో అనుకోవాలి.

జ‌గ‌న్‌లో గ‌తంలో ఉన్న వాడి ఏమాత్రం త‌గ్గ‌లేదు. అధికార తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తిపోశారు. ప్రత్యేక హోదా మొదలుకొని, పార్టీ ఫిరాయింపులదాకా.. చాలా అంశాలపై అధికార పార్టీని ప్రశ్నించారు వైఎస్‌ జగన్‌. ’21 మంది ఎమ్మెల్యేలను కొన్నారు.. వారితో రాజీనామా చేయించరు..’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార తెలుగుదేశం పార్టీపైన.

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభాన్ని వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి అడుగు దగ్గర్నుంచీ, జగన్‌ వెంట భారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఈ రోజు మొత్తంగా 8 నుంచి 9 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -