Friday, May 3, 2024
- Advertisement -

వైసీపీ నియోజిక‌వ‌ర్గ ఇన్‌చార్జీల బ‌లం, బ‌ల‌గం ఎంత‌..?

- Advertisement -

రాజ‌కీయం మొత్తం ఏపీ చూట్టునే తిరుగుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో పార్టీ నేతలు గెలుపు గుర్రాల‌పై ఫోక‌స్ పెట్టారు. నాయ‌కులు టికెట్లు ఇచ్చే పార్టీల వైపు ప‌రిగెడుతున్నారు. ఏపీలో ముఖ్యంగా టీడీపీ-వైసీపీల మ‌ధ్యే పోరు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌త ఎన్నిక‌ల‌లో గెలుపు అంచును బొక్క బొర్ల‌ప‌డ్డ వైసీపీ ఈ సారి ఛాన్స్‌ను వ‌దులుకోకూడ‌ద‌ని భావిస్తోంది. దీనిలో భాగంగానే పార్టీ అధినేత జ‌గ‌న్ నాయ‌కుల‌పై ఫోక‌స్ పెట్టినట్లు క‌నిపిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల‌లో ఆర్థికంగా బ‌ల‌మైన నేత‌ల‌ను పోటీలో నిల‌పాల‌ని భావిస్తున్నాడు జ‌గ‌న్‌. జిల్లాల‌ వారిగా మొద‌లుపెట్టి నియోజిక వ‌ర్గాల మీద దృష్టి సారించారు. పార్టీ అధినేత నియోజిక వ‌ర్గ అభ్య‌ర్థి బ‌లా,బ‌ల‌గంపై దృష్టి పెట్ట‌డం మంచి పరిణ‌మామే కాని , ఇలా బ‌ల‌గం పై కాకుండా బ‌లంపైనే దృష్టి పెట్ట‌డం దుర‌దృష్టక‌రం.

తాజా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నియోజిక వ‌ర్గాల వారి అభ్య‌ర్థుల ఆర్థిక స్థోమ‌త‌ల‌ను ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారం క‌ల్లా జాబితాను అంద‌జేయాల‌ని హుకుం జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల స‌మ‌యంలో డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టే నేత‌ల‌కే టికెట్లు ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట జ‌గ‌న్‌. అందుకే నియోజిక వ‌ర్గానికి ఎంత ఖ‌ర్చు పెట్ట‌గ‌ల‌ర‌ని అడిగి మ‌రి సీటు ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు . గ‌త ఎన్నిక‌ల‌లో జ‌రిగిన తప్పుల‌ను ఈ సారి జ‌ర‌గ్గాకుండా చూడ‌టానికి తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు వైసీపీ అధినేత‌. అయితే ఈ విష‌యంలో పార్టీలో పేరున్న నేత‌ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదని తెలుస్తోంది. ప్ర‌జ‌ల‌లో మంచి పేరుంటే స‌రిపోదని ఎన్నిక‌ల స‌మ‌యంలో డ‌బ్బులు పంచితేనే ఓట్లు ప‌డ‌తాయ‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నాడు జ‌గ‌న్. జ‌గ‌న్ తీరుతో కొంద‌రు నేత‌లు కంగుతింటున్నారు. పార్టీలో సీనియ‌ర్ లీడ‌ర్ల‌ను సైతం మీరు ఎన్నిక‌ల‌కు ఎంత పెడుతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారట జ‌గ‌న్. అయితే ఇలా డ‌బ్బు మీదే ఆధార‌ప‌డి ఎన్నిక‌ల‌కు వెళ్తే దెబ్బ‌తింటామ‌ని సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్న‌ప్ప‌టికి , జ‌గ‌న్ ఎవ‌రి మాట వినకుండా మొండిగా వ్య‌వ‌హారిస్తున్నారని పార్టీ నాయ‌కులే చ‌ర్చించుకుంటున్నారు. మొత్త‌నికి ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో జ‌గ‌న్‌లో అనుహ్య ప‌రిణమాలు చూసి సొంత పార్టీ నాయ‌కులే షాక్ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -