Saturday, May 11, 2024
- Advertisement -

శ్రీవారి దర్శనంతో పాద యాత్ర మొదలు

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించ‌నున్న అన్న‌వ‌స్తున్నాడు పాద‌యాత్ర‌పై గంద‌ర‌గోలం నెల‌కొంది. అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి. పాద‌యాత్ర‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోర్టులో వేసిన జ‌గ‌న్ పిటీష‌న్ కు ఎదురుదెబ్బ‌త‌గిలింది. ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రుకావాల్సిందేన‌ని కోర్టు తెల‌ప‌డంతో…మ‌రో సారి సీబీఐ కోర్టులో డిఛ్చార్జ్ పిటిష‌న్ వేశారు జ‌గ‌న్‌.

తాజాగా వాయిదా పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి అక్టోబరులోనే ఆయన పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా వేశారు. నవంబరు 2న జగన్ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది.

విజ‌య‌వాడ‌లో జ‌రిగిని ప్లీన‌రీలో పాద‌యాత్ర చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఒకసారి బహిరంగంగా ప్రకటించేసిన తర్వాత మడమ తిప్పితే ఏం బాగుంటుంది? అందుకనే మధ్యే మార్గంగా జిల్లాలయాత్రను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు అన్నీ జిల్లాల పార్టీల ముఖ్య నేతలకు కబురు కూడా వెళ్ళిపోయిందట. తేదీలో కూడా కొద్దిగా మార్పుండచ్చని అంటున్నారు. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 27 కాకుండా నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కావచ్చచంటున్నారు. సరే, ఇది కూడా ఒకందుకు మంచిదేనని పార్టీ నేతలు సర్దుకుంటున్నారు.

పాదయాత్రకు ముందు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుని పాదయాత్రకు శ్రీకారం చుడతారు. తొలుత కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర చేస్తారు. అనంతరం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా సాగి ఇచ్చాపురంలో ముగుస్తుందని వైసీపీ శ్రేణులు తెలిపారు.

జిల్లాలయాత్రకు తగ్గట్లుగా రూట్ మ్యాప్ సిద్దమవుతోందట. పాదయాత్ర సందర్భంగా జిల్లా స్ధాయిల్లో స్ధానిక నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలు కూడా జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి ప్రత్యామ్నాయ జిల్లాలయాత్రలైనా వర్కవుట్ అవుతుందో లేదో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -