వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్ చందర్‌లు వైఎస్ జగన్‌ను కలిసారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’గా గుర్తింపు తెచ్చుకున్న పృధ్వీరాజ్ జోస్యం చెప్పాడు. ఢిల్లీలో ఆప్ సాధించినంతటి ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంతం చేసుకోనుందని వ్యాఖ్యానించాడు. కావాలంటే ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చని అన్నాడు.
తన అనుచరులు, ఇతర నేతలు చెప్పే మాటలు, సలహా, సూచనలను వైఎస్ జగన్ పట్టించుకోరని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నాడు. జగన్ ను దగ్గర నుంచి చూసిన తనకు ఆయన మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసునని చెప్పారు. గతంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ పాప్యులారిటీని చూసి, మొత్తం ప్రభుత్వం రంగంలోకి దిగి విజయం కోసం శ్రమించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు.
