Sunday, May 5, 2024
- Advertisement -

నాడు వైఎస్ చేసిందే నేడు మేం చేశాం : జగన్ కు ఘాటు లేఖ

- Advertisement -

వైఎస్ఆర్ సీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిపోయిన 22 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులు సహా , వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాసిన ఘాటైన లేఖ వైఎస్ఆర్ సీపీలో కలకలం రేపింది. ఇన్నాళ్లూ ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు వేయాలని, దేశంలో ఎక్కడా ? ఏ పార్టీలోనూ ఫిరాయింపులు లేనట్టు, అసలు ఏపీలోని అన్ని సమస్యలకు వారిపై వేటే సరైన పరిష్కారమార్గమన్నట్టు కాలం గడుపుతున్న వైఎస్ఆర్ సీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయలా ఆ లేఖ పడింది. తెల్లారి లేచింది మొదలు 22మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి. వారిపై వేటు వేస్తేనే సభకు వస్తాం. అని వైఎస్ఆర్ సీపీ అధినేత సహా ఆయన పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. వారి దృష్టిలో అంతకంటే ప్రజాసమస్య ఇంకొకటి లేదు. 175 నియోజకవర్గాల ప్రజలు, ప్రజాసమస్యలపై శాసనసభలో మాట్లాడాల్సిన వీళ్లు, ప్రజాధనం నుంచి లక్షల్లో జీతభత్యాలు తీసుకుంటూ సభకు మాత్రం డుమ్మా కొడుతున్నారు. ఎంతసేపూ ఫిరాయింపు, ఫిరాయింపు..ఈ మాట తప్పితే ఇంకో రాజకీయం చేతకావట్లేదనే విమర్శలూ మూట గట్టుకుంటున్నారు. ఫిరాయింపు నేతలు ఆయా నియోజకవర్గాల్లో ఎటూ తమకు ఓట్లేసిన వారికి సమాధానం చెప్పుకోవాల్సిందే. స్థానిక సమస్యలు పరిష్కరిస్తే మళ్లీ గెలిపిస్తారు. లేదంటే ఇంటికే పరిమితం చేస్తారు. ఇక వారి సంగతి ప్రజలకు వదిలేసి, ప్రతిపక్షం హోదాలో రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ‘ఫిరాయింపు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయండి’…. అంటూ కాలక్షేపం చేస్తున్న వీరికి, ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాసిన ఘాటైన లేఖలో ఏముందో తెలిశాక కళ్లు తేలేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలోని కొన్ని అంశాలు యథాతథంగా ఆద్య న్యూస్ పాఠకుల కోసం…

‘మీ ఫ్యూడల్‌ వ్యవహార శైలి నచ్చకే బయటికి వచ్చాం. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ పని చేస్తున్న ముఖ్యమంత్రిని బలపరిచేలా అడుగులు వేశాం’’. జగన్ నీకు సరైన వయసు లేదు, అనుభవం లేదు, స్వతహాగా వినే నైజం లేదు. కేవలం సహ నిందితుల సలహాలతోనే ముందుకు సాగాలన్న మీ ఆలోచన భరించలేక… అధికారమే పరమావధిగా, కుట్ర రాజకీయాలే ప్రధాన అజెండాగా కొనసాగిస్తూ, ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసే నీచ మనస్తత్వాన్ని సహించలేక బయటకు వచ్చేశాం. ‘కేసుల మాఫీ కోసం కేంద్రంతో మీ చీకటి ఒప్పందాలు, బీజేపీతో మీ పార్టనర్‌షిప్‌ చూసి సహించలేకే దూరమయ్యాం. ఫ్యాక్షన్‌ పునాదుల మీద నిర్మించిన మీ ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని సమర్థించలేక, మానసిక సంఘర్షణ భరించలేక వచ్చేశాం.

మీ నాన్న వైెస్ఆర్ రాజకీయ పుట్టుకే ఫిరాయింపుతో మొదలైందని గుర్తులేదా? ఆనాడు సభలో నాటి ప్రతిపక్షనేత భాట్టం శ్రీరామమూర్తి మీ నాన్నపై చేసిన వ్యాఖ్యలు తెలుసా? మధుపర్కాలతో మంగళ సూత్రాలతో పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయిన కొత్త పెళ్లి కూతురిలా నీ (మర్రి చెన్నారెడ్డి) వైపు వెళ్లాడు మా రాజశేఖర రెడ్డి! ఏముంది నీలో ఆకర్షణ?’’ అని భాట్టం అన్నారు.1978లో రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వైఎస్‌… రాజీనామా చేయకుండానే ఇందిరా కాంగ్రెస్‌లో చేరి మంత్రి కాలేదా? 1993లో ఏడుగురు టీడీపీ ఎంపీలను కాంగ్రె్‌సలోకి లాక్కొన్నప్పుడు ఈ విలువలు ఏమయ్యాయి? 2004లో 16 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వైఎస్‌ కాంగ్రె్‌సలో చేర్చుకోలేదా? అణు ఒప్పందంపై పార్లమెంటులో ఓటింగ్‌ సందర్భంగా ఇద్దరు టీడీపీ ఎంపీలను కాంగ్రెస్‌ వైపు మళ్లించలేదా? 2009లో బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డిలను తీసుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయించలేదు? మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఆ రోజు మీ తండ్రి ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు? మీ దగ్గరకొచ్చిన వాళ్లకు ఎన్ని కోట్లు ఇచ్చావు?’’

వీటితో పాటు పలు విమర్శలు గుప్పిస్తూ లేఖ రాశారు. అయితే ప్రధానంగా వైఎస్ నాడు పార్టీ ఫిరాయింపు చేసినప్పుడు నాటి ప్రతిపక్షనేత భాట్టం శ్రీరామమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇన్నాళ్లూ ఏ పాయింట్ పై వైఎస్ఆర్ సీపీ రాద్ధాంతం చేస్తోందో..ఇప్పుడు అదే పాయింట్ పై నాడు వైఎస్ చేసిన పనిని, దానిపై భాట్టం శ్రీరామమూర్తి చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ టీడీపీ ఎండగట్టడంతో వైఎస్ఆర్ సీపీకి దిక్కుతోచన పరిస్థితి ఎదురైంది. ఇన్నాళ్లూ చాలామందికి తెలియని ఈ విషయం ఇప్పుడు బయట పెట్టడంతో ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -