Tuesday, April 23, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌పై జ‌గ‌న్ ఫోక‌స్‌…

- Advertisement -

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటె అది నంద్యాల ఉప ఎన్నిక‌. రెండు ప్ర‌ధాన పార్టీలు గెలుపుపై స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. టీడీపీ మంత్రివ‌ర్గాన్ని, ప‌దుల సంఖ్యంలో ఎమ్మెల్యేల‌ను నంద్యాల‌లో దింపింది. వీరంద‌రు పార్టీ గెలుపుపై దృష్టిసారించారు.ప‌చ్చ‌పార్టీ నాయ‌కులంద‌రు ఓట‌ర్ల‌కు వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుదృష్టి సారించారు. పార్టీ పరిస్థితిపై కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల నుంచి అడిగి తెలుసుకున్నారు. నంద్యాలలో మనం ఎక్కడ ఉన్నామని, వార్డుల వారీగా పరిస్థితి ఎలా ఉందని జగన్ ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు నంద్యాలకు వెళ్లి ఉప ఎన్నికలపై దృష్టి సారించాలని సూచించారు.
ఉప ఎన్నికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, బాగా కష్టపడాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. ఈ సందర్భంగా నంద్యాలకు వెళ్లి వచ్చిన నేతలు స్థానిక పరిస్థితులను అధినేతకు వివరించారు. టిడిపి పరిస్థితి ఎలా ఉంది, వైసిపి పరిస్థితి ఎలా ఉందో ఆయనకు క్లుప్తంగా చెప్పారు.
ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంజాద్ బాష, ముస్తఫా, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరికి అదనంగా శ్రీకాంత్ రెడ్డి, రోజా తదితర ఎమ్మెల్యేలకూ కొత్తగా బాధ్యతలు అప్పగించారు.
ఉప ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఆ నియోజకవర్గంలో జగన్‌ రోడ్‌ షో నిర్వహించడంతో పాటు, విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఇప్పటి నుంచే చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -