Saturday, April 20, 2024
- Advertisement -

అనంపురంలో వైసీపీకి ఎదురు దెబ్బ‌…

- Advertisement -

అనంత‌పురంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంది. ఆ పార్టీనుంచి కీల‌క నేత టీడీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ద‌మ‌య్యారు. చంద్ర‌బాబు నాయుడు ఆప‌రేష‌ణ్ ఆక‌ర్ష్‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నారు. సాధ్య‌మైనంత మేర‌కు వైసీపీలో ఉన్న కీల‌క నాయ‌కుల‌ను టీడీపీలోకి చేర్చుకొని జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తాజాగా అనంతపురం వైకాపా మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గురునాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్ద‌రి నేతల మధ్య ఉన్న ఆధిపత్య చిచ్చు మరింతగా రగులుతుండటంతో గురునాథ్‌రెడ్డి పార్టీ మారాల‌నె యేజ‌న‌లో ఉన్నారంట‌. తన రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే, పార్టీ మారడం ఒక్కటే మార్గమని భావిస్తున్న ఆయన, తన మనసులోని మాటను దగ్గరి సన్నిహితులతో పాటు పరిచయమున్న టీడీపీ నేతలకు చేరవేసినట్టు తెలుస్తోంది.

గ‌త కొంత‌కాలంగా అనంతపురం వైసీపీలో అంతర్యుర్థం నడుస్తోంది. వ‌చ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం ఎక్కువ మంది పోటీలో ఉండటం, మాజీ ఎంపీ అనంత అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తుండటం, సమన్వయకర్తగా తనను వదిలి నదీంకు బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు గురునాథరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించాయని తెలుస్తోంది. ఆయన టీడీపీలో చేరితే ఆ కుటుంబం మొత్తం పార్టీ మారిపోతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వాస్తవానికి పరిటాల రవి కుటుంబంతో ఆదినుంచి గురునాథరెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం పరిటాల సునీతతోనూ ఆయన సఖ్యతను కొనసాగిస్తున్నారు. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికీ ఆయన సన్నిహితుడే. ఈ నేపథ్యంలో గురునాథరెడ్డి వైకాపాలో కన్నా టీడీపీలో చేరడమే బెటరని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ప్ర‌క‌ట‌న రాకున్నా పార్టీ మరడం మాత్రం ఖాయం అనె వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -