Monday, May 20, 2024
- Advertisement -

గోడ దూకెందుకు రెడీగా ఉన్న వైసీపీ నేత‌లు….?

- Advertisement -

ఒక వైపు పాద‌యాత్ర మ‌రో వైపు జంపింగ్ జిలానీల‌తో స‌త‌మ‌వుతున్న వైసీపీ పార్టీకి త్వ‌ర‌లోనె మ‌రో గ‌ట్టి షాక్ త్వ‌ర‌లో త‌గ‌ల‌నుంద‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మ‌రో రెండు వికెట్లు గోడ దూకెందుకు రెడీగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికె 21 మంది ఎమ్మెల్యేలు బాబు చెంత‌కు చేరిపోయారు. అయితె ఇంత‌టితో జంపింగ్ జిలానీల‌తో ఆగిపోలేదు. అవ‌కాశం వ‌స్తె గోడ దూకెందుకు వైసీపీ నేత‌లు రెడీ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో జ‌గ‌న్‌కు అత్యంత కీల‌క‌మైన నేత‌లు ఉండ‌టంతో పార్టీ ఆందోళ‌న చెందుతోంది.

జనవరిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగ‌తి తెలిసిందె. ఇప్పుడున్న మెజారిటీ ప్ర‌కారం వైసీపీకి ఒక రాజ్య‌స‌భ‌సీటు ద‌క్కే అవ‌కాశం ఉంది. అది కూడా ద‌క్కుకండా చేయ‌డానికి చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. వైసీపీనుంచి ఐదారుగురు వైసీపీ ఎమ్మెల్యేలను త‌మ‌ వైపు తిప్పుకుంటె జ‌గ‌న్‌కు పెద్ద దెబ్బ‌.

దీనిలో భాగంగానె నెల్లూరు జిల్లా నుంచి కూడా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ టచ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి, మరో ఎమ్మెల్యే కూడా జనవరిలోగా బాబు చెంత‌కు చేర‌తార‌ని టీడీపీ వర్గాలు అంటున్నాయి. జ‌గ‌న్ మాత్రం ఈసారి బలమైన అభ్యర్థులకు టికెట్‌ ఇవ్వాలని జగన్‌ ఆలోచిస్తున్నారు.

మంత్రి నారాయణ రామిరెడ్డిని సైకిలెక్కాల‌ని ఆహ్వానిస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో వైసీపీకి ఇబ్బందులు తప్పవని సమాచారం. రామిరెడ్డి టీడీపీలో చేరితే కావలి టీడీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని టీడీపీ నేతలు ఆయనకు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అదేవిధంగా కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిని కూడా దారిలోకి తెచ్చుకోవాల‌ని టీడీపీ భావిస్తోంది.

మ‌రో నేత కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డిపై క‌న్నేసింది టీడీపీ. ఆయ‌న‌పై మ‌ద్యం స‌హా సోమిరెడ్డిపై చేసిన ఆరోప‌ణ‌ల కేసు ఉండ‌డంతో వీటి ఉచ్చు బిగిస్తే.. వ‌చ్చేస్తాడ‌ని టీడీపీ న‌తేలు భావిస్తున్నారు. ఇప్ప‌టికె అనేక ఆటుపోట్ల‌ను ఎదుర్కొంటున్న వైసీపీకి కోలుకోలేని దెబ్బ త‌గిలిన‌ట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -