Friday, May 10, 2024
- Advertisement -

చాలాదూరం: చంద్రబాబు… రామోజీలకు దూరం పెరిగింది!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు మీడియా గ్రూప్స్ అధినేత రామోజీ రావులకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటో… ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు.

చంద్రబాబు ఉత్తాన్నపతనాల్లో రామోజీ కీలక పాత్ర పోషించాడు. ఎన్టీఆర్ ను కూలదోసి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని, రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవడంలో రామోజీ సహకారం అలాంటిలాంది కాదు. చంద్రబాబు చేస్తున్నది తిరుగుబాటు కాదు.. అనే భావనను ప్రజల్లోకి పంపించడంలోనూ… చంద్రబాబు కు దగ్గరకు ఎమ్మెల్యేలను చేర్చంలోనూ ఈనాడు కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు నడకకు రామోజీ రావు అడుగడుగునా సహకారం అందించాడు. చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాస్తూ… ఎన్నికల సమయాల్లో తెలుగుదేశం పార్టీ ని ఆకాశానికెత్తేస్తూ చూపించి… సహకరిస్తూ వస్తోంది ఈ నాడు గ్రూప్. ఇక తెలుగుదేశం అధినేతకు వ్యతిరేకం అయిన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ లపై కూడా ఈనాడులో దుమ్మెత్తిపోయడం రొటీనే!

మరి అలాంటి బద్ధ శత్రువులు అయిన రామోజీ, జగన్ లు ఇప్పుడు సమావేశం అయ్యారు. మరి దీని వెనుక ఉన్న కథ ఏమిటి? ఈ సమావేశానికి కారణాలు ఏమిటి? అనే విషయాల గురించి వాకబు చేస్తే… రామోజీకి, చంద్రబాబుకు పెరిగిన దూరం కూడా ఈ సమావేశానికి ఒక కారణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రామోజీ, చంద్రబాబులకు సన్నిహిత సంబంధాలు లేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ప్రాజెక్టులోచంద్రబాబు రామోజీని పట్టించుకోలేదని తెలుస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తో కూడా రామోజీ సన్నిహిత సంబంధాలే కలిగి ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో… చంద్రబాబుకు, రామోజీకి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది.

ఇటీవల ఈనాడు పత్రికలో ఏపీలోని ఇసుక కుంభకోణం గురించి వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ఆ కుంభకోణంలో తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యపాత్ర పోషించారని ఈనాడులో కథనం వచ్చింది. సరిగ్గా ఇదే నేపథ్యంలో.. జగన్ , రామోజీల సమావేశం జరిగింది. ఈ పరిణామాలన్నింటినీ బట్టి చూస్తూ.. చంద్రబాబుకు, రామోజీకి మధ్య వైరుధ్యాలు ఏర్పడ్డాయని.. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకొంటూ జగన్ మోహన్ రెడ్డి రామోజీని కలిశాడనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -