Saturday, May 4, 2024
- Advertisement -

ఎమ్మెల్యేల‌పై బాబు ఫైర్‌..పార్టీకీ న‌ష్టం క‌లిగిస్తే వ‌దులుకునేందుకు సిద్ధం..

- Advertisement -

ప్ర‌భుత్వ అధికారుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్రం వ్య‌క్తం చేశారు. పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే విధంగా ఎవ‌రు ప్ర‌వ‌ర్తించే వారు ఎవ‌రైనా ఉపేక్షించేదిని తేల్చి చెప్పారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించే వారిని వదులుకొనేందుకు కూడ తాను సిద్దంగా ఉన్నానని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పేశారు.

బాబు స‌మ‌క్ష‌నా అమ‌రావ‌తిలో స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పార్టీ బ‌లోపేతంపై చ‌ర్చిచ‌డంతోపాటు భాజాపా, వైసీపీ, జ‌న‌సేన పార్టీల‌పైన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్ర‌మే యూట‌ర్న్ తీసుకుంద‌ని అన్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు మూడు పార్టీలు లాలూచీపడి కుట్రలు చేస్తున్నాయన్నారు. ఒంగోలు ధర్మపోరాట సభ రోజే మరోచోట పోటీ దీక్షలు చేస్తున్నారని, దీంతో బీజేపీ, వైసీపీ, జనసేనల లాలూచీ తేలిపోయిందన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వ్యవహరిస్తున్న తీరుపై ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో అధికారులను టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు దుర్భాషలాడడంపై బాబు మండిపడ్డారు. మరోవైపు పెందుర్తి ఎమ్మెల్యే వెంకటేష్ కూడ అధికారుల తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేయడంపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు

అధికారుల పట్ల ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చే వారిని వదులుకునేందుకూ సిద్ధమేనని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -