Sunday, May 12, 2024
- Advertisement -

తెలంగాణలో ఇంతలోనే ఎన్నికలొచ్చేస్తాయి…!

- Advertisement -

దాదాపు డజనుమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డట్టుగా ఉన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ల నుంచి వీరు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరిపోయారు.

తమ తమ పార్టీలు అధికారంలోకి రాలేదన్న భావనతో వీరు అధికారంలో ఉన్న తెరాసలోకి చేరిపోయారు. ఇలంటి ఫిరాయింపులన్నీ అధికార యావతో జరిగినవే అని వేరే చెప్పనక్కర్లేదు.మరి ఇలాంటి నేతలకు ఇప్పుడు కష్టం కాలం తప్పేలా లేదు. 

తమ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడ్డ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ వివిధ పార్టీలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ విచారణలో భాగంగా ఫిరాయింపుదారులపై ఎందుకు చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ.. కోర్టు తెలంగాణ ఏజీని ప్రశ్నించింది. ఈవిషయంలో స్పీకర్ వివరణ కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు న్యాయస్థానం ఈ అంశంపై జోక్యం చేసుకోవడానికి వీలు లేదన్న ఏజీ వాదనతో కోర్టు ఏకీభవించలేదు.

ప్రస్తుతానికి అయితే కేసు ఈ నెల 22 వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజున జరిగే వాదనల్లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కోర్టు ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్ గా తీసుకొని.. ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలపై వేటు వేయిస్తే.. తెలంగాణలో మళ్లీ ఎన్నికల ముచ్చట వస్తుంది. దాదాపు పది పన్నెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. మరి అవే జరిగితే.. రాజకీయం రసపట్టులోకి జారినట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -