Friday, April 19, 2024
- Advertisement -

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -

మన దేశంలో నిత్యం వంటల్లో ఉపయోగించే వాటిలో ముఖ్యమైనది పసుపు. ఇక ప‌సుపు లేకుండా వంట‌లు చేయ‌డానికి చాలా మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌రు. ప‌సుపు వంట‌లే కాదు ఆరోగ్యానికి మ‌రియు అందాన్ని కాపాడాటానికి కూడా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఇది కేవలం వంటల్లోనే కాదు.. శుభకార్యాల్లో కూడా వాడుతుంటారు. తెలుగు వారు ఏ శుభకార్యం అయినా కాళ్లకు పసుపు రాసుకోవడం సాంప్రదాయం. ప‌సుపుతో కొన్ని చిట్కాలు పాటించే అందం మ‌రియు ఆరోగ్యం మీ సొంతం చేసుకొవ‌చ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పసుపులోని అత్యంత శక్తివంతమైన భాగం కర్కుమిన్ – ఇది దాదాపు అన్ని విధాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, డయాబెటిస్ (మధుమేహం), మరియు అల్జీమర్స్ చికిత్సలలో ఉపయోగపడుతుంది అని చెప్పబడింది. పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడుతుంది.

ఇది క్యాన్సర్ కణాల విస్తరణను కూడా నిరోధిస్తుంది. పసుపులో ఉండే అతి ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్. ఇతర సమ్మేళనాలలో కర్కుమినాయిడ్స్ మరియు కొన్ని నూనెలు ఉన్నాయి. కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఆక్సీకరణ ఒత్తిడి ఒకటి. పసుపులోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలదు. ఇది కాలేయాన్ని కాపాడుతుంది మరియు గట్టిపడకుండా చేస్తుంది.వేడి పాలల్లో పసుపు కలుపుకోని ఉదయం,సాయంత్రం తాగినట్లయితే జలుబు, రోంప చాలా తోందరగా తగ్గుతాయి.గోంతు ఇన్ ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే మలినాలను, విష పదార్ధాలను పసుపు పోగోడుతుంది. ఇటీవల ప్రబలిపోతున్న కరోనా వ్యాధిని నిర్మూలించే ఔషదాల్లో పసుపు ముఖ్యపాత్ర వహిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -