Friday, May 3, 2024
- Advertisement -

జుట్టు సంరక్షణకు చిట్కా

- Advertisement -

ఆహారపు టలవాట్లు, పోషకాలు లోపించడం, నీటి మార్పిడి ఇలా ఎన్నో కారణాలతో అతి చిన్న వయసులోనే టీనేజ్ వయసువారిలో జుట్టు రాలడం, తెల్లబడడం వంటి సమస్యలు తలెత్తున్నాయి.

ఇటువంటి జుట్టు సంబంధిత సమస్యలనుంచి తప్పించుకోవడానికి రక రకాల చికిత్సల కోసం ఎంత డబ్బైనా ఖర్చుచేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే జుట్టు సమస్యలను అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుంది. మెంతి పొడి, ఆవాల పొడి, టీ పొడి, గోరింటాకు, పెరుగులు అన్నీ ఒక్కొక్క స్పూను చొప్పున కలిపి అందులో నిమ్మ రసం పిండి బాగా కలిపాలి. ఓ రాత్రంతా దీన్ని నానబెట్టి మరుసటి రోజు తలకు పట్టించి ఆరిన తర్వాత శీకాయి పొడితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు పట్టులాగా ఉంటుంది. జుట్టు తెల్లబడడం, రాలడం వంటివి తగ్గి జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -