టిక్ టాక్ అభిమానులకు శుభవార్త!

- Advertisement -

చైనా బైట్‌డ్యాన్స్‌‌కు చెందిన టిక్‌టాక్ భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రత వంటి వాటి విషయంలో ప్రమాదకరంగా మారిందంటూ జూన్‌లో దీనిపై కేంద్రం నిషేధం విధించింది. అయితే మన దేశంలో టిక్ టాక్ ని అభిమానించే వారి శాతం విపరీతంగా పెరిగిపోయింది. టిక్ టాక్ తో ఎంతో మంది ఔత్సాహికులు తమ ప్రతిభను చాటుకుంటూ వచ్చారు. అలాంటిది టిక్ టాక్ బ్యాన్ కావడంతో ఎంతో మంది నిరుత్సాహ పడ్డారు.

భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ, గోప్యత, భద్రత పరమైన చర్యలు చేపట్టింది.  తాజాగా టిక్ టాక్ అభిమానులకు శుభవార్త. నిషేధానికి గురైన ఈ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ మళ్లీ భారత్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ సంస్థ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఉద్యోగులకు రాసిన లేఖతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

- Advertisement -

భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ, గోప్యత, భద్రత పరమైన చర్యలు చేపట్టింది. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ భారత ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇంకేమైనా సమస్యలు లేవనెత్తినా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఉద్యోగులకు రాసిన లేఖలో ఈ విషయాలను ప్రస్తావించిన గాంధీ.. భారత్‌లో తిరిగి అడుగుపెట్టేందుకు ఇది సానుకూల అంశమని అన్నారు. ఉద్యోగులతో కలిసి తిరిగి వినియోగదారులు, క్రియేటర్లకు అంకితమవుతామని వివరించారు. 

తెలంగాణలో ఐఏఎస్ బదిలీలు!

కమలా హారిస్ కీలక ప్రకటన .. వారికి పన్నులు పెంచము..!

ఇప్పట్లో బడులకు మోక్షం లేనట్టేనా?

వార్త, ఆన్ లైన్ మూవీస్ పై కేంద్ర సమాచార శాఖ ప్రత్యేక నిఘా!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...