Saturday, April 20, 2024
- Advertisement -

తెలుగు లో ఉత్తమ నటీమణులు ఆనలుగురు…

- Advertisement -

ఉత్తమ నటనకు పురస్కారాలు కొలమానం కాదు. అవార్డులు​ ఒక ప్రోత్సాహ సూచిక. మెచ్చే అభినయం, ఆకట్టుకున్న భావాలు, పాత్రలో లీనమై చేసిన నటన.. ఇవన్నీ నటీనటులను పురస్కారాలకు చేరువ చేస్తాయి. భారతదేశంలో​ నటీనటులకు అత్యుత్తమ పురస్కారం జాతీయ చలనచిత్ర అవార్డులు. తెలుగు సినిమాల్లో ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నవారు నలుగురు. వారి గురించి..

శారద – నిమజ్జనం (1976)
తెలుగు సినిమాల్లో ఉత్తమ నటి పురస్కారం అందుకున్న తొలి ఘనత నటి శారదకు చెందుతుంది. ఈ సినిమాకంటే ముందే రెండు సార్లు ఉత్తమ నటిగా ఊర్వశి అవార్డు అందుకుని ఆమె ‘ఊర్వశి శారద’ అనిపించుకున్నారు. అయితే అవి రెండూ మలయాళం సినిమాలు. 1976లో దర్శకుడు బి.ఎస్.నారాయణ తీసిన ఈ చిత్రంలో​ ఆమె నటన అజరామరం అనిపిస్తుంది. తండ్రి అస్థికలు గంగలో నిమజ్జనం చేసేందుకు కాశీకి వెళ్తున్న ఓ బ్రాహ్మణ భార్యాభర్తలకు ఎదురైన అనుభవాలే ఈ సినిమా​ కథ. ఇందులో బండి నడిపేవాడి చేతిలో అత్యాచారానికి గురైన మహిళగా శారద నటన అద్భుతం.

అర్చన – దాసి(1988)
బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన దాసి తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. తెలంగాణ గడీలోని దాసీల బతుకులపై తీసిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. ఇందులో దాసి కమలాక్షిగా నటించిన అర్చన జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. అది ఆమె రెండో పురస్కారం​ కావడం విశేషం.

విజయశాంతి – కర్తవ్యం (1990)
మోహన్‌గాంధీ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. విజయశాంతి కెరీర్లో అతిపెద్ద హిట్‌గా నిలిచి, ఆమెకు హీరోలతో సమానమైన ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. భారతదేశ తొలి మహిళా ఐఏఎస్ అధికారి కిరణ్‌బేబీ స్ఫూర్తితో తీసిన ఈ సినిమాలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.

కీర్తి సురేష్ – మహానటి (2019)
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు సుమంత్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌కు జాతీయ స్థాయిలో పురస్కారం అందించింది. సావిత్రి పాత్రలో​ కీర్తి అద్భుతంగా నటించి, మెప్పించారు.

మాయాబజార్ సినిమాలో​.. భలే భలే టైటిల్స్!

ఎప్పటికీ గుర్తుండిపోయే జయమాలిని ఐటమ్ సాంగ్స్..!

నవలల ఆధారంగా వచ్చిన చిరంజీవి సినిమాలు..!

ఎన్టీఆర్ భిన్నమైన వేషాలు.. హిట్ అయిన ఐదు సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -