Thursday, April 25, 2024
- Advertisement -

దేశంలో నువ్వే సంపన్నురాలివి తల్లి అంటున్న సోనూసూద్..!

- Advertisement -

సోనూ సూద్‌ కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు.కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది కార్మికులకు అండగా నిలిచి వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది.కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.సోనూకు చేయూత ఇచ్చేందుకు తన తోటి నటీనటులతో పాటు,దేశ నలుమూలల నుంచి అభిమానులు ముందుకు వస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లా ఆండ్రావారిపల్లికి చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి (23) సోనూసూద్‌ ఫౌండేషన్‌కు 15 వేలు విరాళం ఇచ్చింది.ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు.కానీ తాను కష్టాల్లో ఉండి, పైగా దివ్యాంగురాలైన తనకు వస్తున్న పింఛను మొత్తాన్ని ఐదు నెలలుగా దాచుకొని ఇతరులకు సహాయం చేయడం గర్వించదగ్గ విషయమే కదా.అంధురాలైనా సరే సాయం చేయడంలో గొప్ప మనసును నిరూపించుకుంది.

Also read:పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

నాగలక్ష్మిపై సోనూసూద్ ప్రశంసలు కురిపిస్తూ అంధురాలు, యూట్యూబర్‌ నాగలక్ష్మి నా ఫౌండేషన్‌కు రూ.15వేలు విరాళం ఇచ్చారు. ఇది ఆమె ఐదు నెలల పింఛను. నా దృష్టిలో దేశంలో ఆమే అత్యంత సంపన్నురాలు. ఒకరి కష్టాలు చూసేందుకు కంటిచూపు ఉండాల్సిన అవసరంలేదు అని కీర్తించారు. నాగలక్ష్మి ఇటీవలే కవిత నాగ వ్లాగ్స్‌ పేరిట యూట్యూబ్‌ చానల్‌ను స్థాపించి దానిద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథ శరణాలయాలు, వృద్ధులు, పేదలకు అందిస్తోంది.ఒకరి కష్టాలు చూసేందుకు కళ్లే ఉండాల్సిన అవసరం లేదు. మనసు ఉంటే చాలు అని నిరూపించింది.

Also read:బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -