Sunday, May 12, 2024
- Advertisement -

త‌ప్పెవ‌రిది..అధికారుల‌దా…? నాయ‌కుల‌దా…?

- Advertisement -

విజ‌య‌వాడ‌లోని ఇబ్ర‌హీంప‌ట్నం ఫెర్రీ ఘాట్ వ‌ద్ద జ‌గ‌రిన బోటు ప్ర‌మాదం అంద‌ర్ని క‌ల‌చి వేసింది. అయితెప్ర‌మాదంపై అధికారులు, మంత్రుల మీద తీవ్ర విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌మాదానికి సంబంధించి షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

ప్ర‌మాదానికి కార‌న‌మ‌యిన బోటు రివర్ బోటింగ్ సంస్థకు చెందినది. స్పీడ్ బోటింగ్‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. పెద్ద బోటింగ్‌కు అనుమ‌తి లేదు. రివర్ బోటింగ్ సంస్థలో ఏపీటీడీసీకి (పర్యాటక శాఖ) చెందిన నలుగురు అధికారులకు వాటాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అనుమతులు లేని రూట్లలోను వీటిని తిప్పుతున్నారు.

అధికారులు బోటింగ్ నిలిపివేసినా, మంత్రి జోక్యంతో రివర్ బోటింగ్ సంస్థపై ఫిర్యాదులు రావడంతో నెల క్రితం బోటింగ్ నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ఓ మంత్రి జోక్యంతో తిరిగి పునరుద్ధరించారని ప్రచారం ముమ్మ‌రంగా సాగుతోంది. ఈసంస్థ‌లో ఉన్న‌తాధికారులే పెట్టుబ‌డులు పెట్టడంతో వారి అండ‌దండ‌ల‌తో రివర్ బోటింగ్ యాజమాన్యం ఇష్టారీతిన పడవలను తిప్పుతోందనె విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

స్పీడ్ బోటుకు మాత్రమే అనుమతులు కోరారు . ప్రమాదానికి గురైన బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్స్ వరకు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకొని స్పీడ్ బోటుకు మాత్రమే అనుమతులు కోరారు. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే నడిపినట్లుగా అధికారులు గుర్తించారు. మ‌రి ఈ పాపం అధికారుల‌దా లేక రాజ‌కీయ నాయ‌కుల‌దా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -