Monday, April 29, 2024
- Advertisement -

జగన్ కు బీసీ పై ప్రేమ.. ఇప్పుడేందుకు?

- Advertisement -

ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బీసీలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు లేనంతగా ఈ మద్య వైసీపీ నేతలు బీసీల ప్రస్తావన పదే పదే తెరపైకి తెస్తున్నారు. ఇక డిసెంబర్ 7న ” జయహో బీసీ మహాసభ ” పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది వైసీపీ. ఈ సభను వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని బీసీ నేతలు, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా పార్టీలోని బీసీ ప్రజా ప్రతినిధులు అందరూ హాజరు కానున్నారు. ఇక ఈ సభకు సి‌ఎం జగన్ కూడా హాజరై కీలక ప్రసంగం చేయనున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఎప్పుడు లేనిది బీసీలపై వైసీపీ ఎప్పుడేందుకు దృష్టి పెట్టింది అనే దానిపై వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. .

ముఖ్యంగా ఎన్నికల్లో గెలవాలంటే బీసీ ఓటు బ్యాంకు చాలా కీలకం. రాష్ట్రంలో దాదాపుగా 140 బీసీ కులాలు ఉండగా మొత్తం బీసీ కులాల సగటు ఓటు బ్యాంకు 25 శాతంగా ఉంది. అందుకే రాజకీయ పార్టీలు బీసీ ఓటర్లను ఆకర్శించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కాగా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైఎస్ జగన్ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే బీసీ ఓటు బ్యాంకు చాలా కీలకమని భావించి, బిసీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇక ఇప్పటికే వైఎస్ జగన్ ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని చెబుతున్నప్పటికి, ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్దంగా ఉండాలని నేతలకు సూచించడం, పార్టీలోని కీలక పదవుల్లో మార్పులు తీసుకు రావడం, అధికారుల నియమకాలు చేపట్టడం, టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం.. ఇవ్వన్ని చూస్తుంటే వైఎస్ జగన్ ఎన్నికల వ్యూహాలుగా తెలుస్తోంది. ఇక అలాంటి వ్యూహంలోని భాగమే ఈ బీసీ సభలు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ ” జయహో బీసీ మహాసభ ” ను డిసెంబర్ 7న విజయవాడలో ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్నారు కాగా ఈ సభను కేవలం విజయవాడ వరకే పరిమితం చేయకుండా జోనల్ వారీగా కూడా ఈ బీసీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు వైసీపీ సిద్దమౌతోంది. మరి బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు వైఎస్ జగన్ వెస్తోన్న బీసీ మంత్రం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

జగన్ను ప్రశ్నించడమే నేరమా.. ఎందుకీ దాడులు?

కే‌సి‌ఆర్ చేస్తే నీతి.. ఇతరులు చేస్తే అవినీతా ?

పవన్ యాక్టర్ గా సక్సస్.. పొలిటీషియన్ గా ఫెయిల్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -