Friday, May 3, 2024
- Advertisement -

బాబు హామీలు కొండంత.. ఇచ్చింది ఇంత..

- Advertisement -

అంతన్నాడు.. ఇంతన్నాడు.. బాబు గారు.. చివరకు ఎన్నికల వేళ మరోసారి మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని పోయిన 2014 ఎన్నికల వేళ చంద్రబాబు హామీ ఇచ్చాడు. దాన్ని ఆగమేఘాల మీద ఎన్నికలకు మూడు నెలల ముందు కొద్దిమందికి అమలు చేసి ఇప్పటివరకు 6వేలు మాత్రమే వారికి చెల్లించాడు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నిరుద్యోగికి బాబు చెల్లించాల్సిన బాకీ రూ.1.20లక్షలు అని తేలింది. ఇంత పెద్ద మొత్తం బాకీ పడ్డా ఇంకా నిరుద్యోగులను మోసం చేయడానికి మళ్లీ కళ్లబొల్లి హామీలతో బాబు గారు చివరి మూడు నెలల్లో పథకాలు అమలు చేస్తూ 2019 ఎన్నికల బరిలో నిలుచున్నారు..

నిరుద్యోగులకు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని పాతరేసి మళ్లీ ఇప్పుడు నిరుద్యోగభృతి , ఉద్యోగాంటూ బాబు గోరంతలు కొండతలు చేస్తున్నారు. నిరుద్యోగుల చెవిలో పూలు పెడుతున్నారు. గత ఎన్నికల్లో నెలకు రూ.2వేలు భృతి పేరిట వందలాది మంది దరఖాస్తు చేసుకుంటే చాలా తక్కువమందికి బాబు భృతి ఇచ్చాడు. మూడు నెలల్లో ఒక్కో నిరుద్యోగికి 6వేలు మాత్రమే ఇచ్చాడు. ఇక బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించాడు. ఈ నాలుగేళ్లలో జాబు రాలేదు.. నిరుద్యోగుల తలరాత మారలేదు. మరోసారి ఎన్నికల ముందర వస్తున్న బాబును నిరుద్యోగులు నమ్మేలా కనిపించడం లేదు.

ఇక పేదలను బాబు దారుణంగా ముంచేశాడు.. గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 1.75 కోట్ల ఇళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన బాబు కేవలం ఎన్నికల వేల లబ్ధి పొందేందుకు ప్రచార ఆర్భాటానికి రూ.3 లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇలా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే చందానా బాబు నిరుద్యోగులు, పేదలను మోసం చేశారు. ఈ ఎన్నికల్లో ఆగ్రహంగా ఉన్న వారు కర్రు కాచి వాత పెట్టేందుకు రెడీ అయ్యారన్న చర్చ సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -