Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లపై ఘాటు విమర్శలను సమర్థిస్తున్న టిడిపి

- Advertisement -

స్వర్గీయ నందమూరి తారక రామారావు చేతుల్లో ఉన్న టిడిపి పార్టీ విషయం పక్కన పెడితే ఆ తర్వాత నుంచీ చంద్రబాబు చేతుల్లో ఉన్న టిడిపి మాత్రం ఎప్పుడూ కూడా ఓట్ల కోసమే నందమూరి జపం చేస్తూ ఉన్నది అన్న మాట వాస్తవం. పార్టీని, ఎన్టీఆర్ భవన్‌ని ఎన్టీఆర్ నుంచి వెన్నుపోటుతో లాక్కున్న చంద్రబాబు జీవిత చరమాంకంలో ఎన్టీఆర్‌ని ఎన్నో విధాలుగా అవమానించాడు. చెప్పులు విసరడాలు, అసెంబ్లీలో కనీసం మాట్లాడనీయకపోవడాలు లాంటివి చేసి నిండు సభలో ఎన్టీఆర్‌ని కన్నీటి పర్యంతం ఏడ్చేలా చేశారు. అందుకే జీవిత చరమాంకంలో చంద్రబాబుని కూడా ఎన్టీఆర్ ఓ స్థాయిలో విమర్శించాడు.

తాను నటించిన సినిమాల్లో ఉన్న అందరు రాక్షసులకంటే చంద్రబాబు ఇంకా పెద్ద రాక్షసుడు అనే స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డాడు ఎన్టీఆర్. అయితేనేం తన మీడియా బలం, మేనేజ్‌మెంట్ తెలివితేటలతో ప్రజలను మాయ చేసి ఎన్టీఆర్ పేరుతో ఓట్లు కొల్లగొట్టుకునే హక్కుని తానే సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి అయినా నందమూరి తారక రామారావు విషయంలో, నందమూరి వారసుల విషయంలో చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీనే అన్నది ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేసే అభిప్రాయం. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ని ఓ స్థాయిలో ఉపయోగించుకున్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్ కూడా తన స్టార్ ఢం, టిడిపికి జై కొట్టిన తర్వాత కొన్ని వర్గాల ప్రేక్షకులు అయినా తన సినిమాలకు దూరమవుతారన్న భయం లేకుండా ప్రాణాలకు తెగించి మరీ టిడిపి కోసం పాటుపడ్డాడు. అయితేనేం ఎన్టీఆర్ ప్రతిభాసామర్థ్యాలు చంద్రబాబు గుండెల్లో భయం పుట్టించాయి. ఎక్కడ లోకేష్‌కి పోటీ అవుతాడోనన్న ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్‌ని పార్టీ నుంచి తెలివిగా తప్పించాడు చంద్రబాబు. అలాగే ఎన్టీఆర్‌పై ఎన్నో నిందలు కూడా వేయించాడు. ఎన్టీఆర్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని చూశాడు.

ఆ విషయాలను పక్కనపెడితే ఇప్పుడు తాజాగా చర్చనీయాంశం అయిన నంది అవార్డ్స్ కేటాయింపులపై డైరెక్టర్ గుణశేఖర్ ఓ స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. రుద్రమదేవి లాంటి చారిత్రాత్మక…. అది కూడా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాను ఎన్నో కష్టాలకు ఓర్చి తెరకెక్కించిన గుణశేఖర్‌పై ఎలా ఎదురుదాడి చేయాలో టిడిపి నేతలకు అర్థం కాలేదు. లెజెండ్ లాంటి సినిమాలతో రుద్రమదేవి పోల్చితే ఎవ్వరైనా సరే రుద్రమదేవికే ఓటేస్తారనడంలో సందేహం లేదు. అందుకే గుణశేఖర్‌పై ప్రతి విమర్శలు చేయలేకపోయారు టిడిపి జనాలు. అయితే ఎప్పుడో ఏళ్ళ క్రితం గుణశేఖర్ వ్యక్తిత్వం మల్లెమాల శ్యాంప్రసాద్‌రెడ్డి రాసిన ఓ పుస్తకాన్ని మాత్రం ఇప్పుడు టిడిపి జనాలు పాపులర్ చేస్తున్నారు. మల్లెమాల ఆత్మకథలో గుణశేఖర్‌ని కృతజ్ఙత లేనివాడిగా విమర్శించిన మాట వాస్తవం.

అయితే గుణశేఖర్‌ని బదనాం చేయడానికి ఈ పుస్తకాన్ని అడ్డుపెట్టుకుంటున్న టిడిపి జనాలు అదే పుస్తకంలో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంకా ఘాటు విమర్శలు ఉన్నప్పటికీ లెక్క చేయడంలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత పిసినారి వ్యక్తి, అలాగే ఎన్నో పౌరాణిక సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఎన్టీఆర్‌కి పురాణాలపై పట్టులేదన్న విషయాలు, అలాగే చంద్రబాబు వివాహ కార్యక్రమానికి తన చేత ఖర్చుపెట్టించిన పిసినారి వ్యవహారాలను ప్రస్తావించాడు ఎం ఎస్ రెడ్డి. ఇక జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై కూడా విమర్శలు చేశాడు ఎంఎస్ రెడ్డి. ఇప్పుడు టిడిపి జనాలు గుణశేఖర్‌ని తక్కువ చేయాలనే ప్రయత్నంలో ఎంఎస్ రెడ్డి పుస్తకాన్ని పాపులర్ చేస్తూ అందులో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న విమర్శలు మరోసారి ప్రజలందరికీ తెలిసేలా చేయడంపై నందమూరి అభిమాను ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ విమర్శకులు కూడా టిడిపిపై కౌంటర్స్ వేస్తున్నారు. గుణశేఖర్‌పై ఎంఎస్ రెడ్డి చేసిన విమర్శలు నిజాలని అనుకుంటే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లపై చేసిన విమర్శలు కూడా నిజాలని టిడిపి నేతలు ఒప్పుకుంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌కి విలువలు లేవు అని ఏళ్ళ క్రితమే ఎన్టీఆర్‌పై ఘాటు విమర్శలు చేశాడు చంద్రబాబు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో ‘ఎన్టీఆర్‌కి విలువలు లేవు’ అని విమర్శించడంతో పాటు ఇంకా ఎన్నో విమర్శలు చేశాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లపై ఉన్న విమర్శలను తామే స్వయంగా ప్రచారం చేస్తున్నారు టిడిపి నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -