ఒక్క డైలాగ్‌తో సినిమా హిట్!

- Advertisement -

సినిమాకు హీరో నాయకుడైతే, ఆ హీరో నాయకత్వాన్ని చూపించేవి పవర్‌ఫుల్ డైలాగులు. అలాంటి డైలాగ్ ఒక్కటున్నా సరే, ఆ సినిమాని కలకలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అలాంటి ఐదు డైలాగుల గురించి ఇక్కడ..

రఫ్ఫాడించేస్తా..(గ్యాంగ్ లీడర్)
చిరంజీవి హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే డైలాగ్ ఇది. ‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో! రఫ్ఫాడించేస్తా’ అంటూ చిరంజీవి పలికే ప్రతిసారీ థియేటర్లలో​ అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఈ డైలాగ్ రాసింది పరుచూరి బ్రదర్స్.

- Advertisement -

కంటి చూపుతో చంపేస్తా (నరసింహనాయుడు)
బాలకృష్ణ నట జీవితంలో మర్చిపోలేని చిత్రం ‘నరసింహనాయుడు’. ఇందులో విలన్ ముఖేష్ రుషితో బాలకృష్ణ పలికే ఈ డైలాగ్ చాలా ప్రాచుర్యం పొందింది. హీరోయిజాన్ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసిన ఈ డైలాగ్ రాసింది పరుచూరి బ్రదర్స్.

అమ్మతోడు.. అడ్డంగా నరికేస్తా (ఆది)
జూనియర్ ఎన్టీఆర్‌కి మాస్ అభిమానుల్ని సంపాదించిపెట్టిన చిత్రం ‘ఆది’. అందులో ఎన్టీఆర్​ చెప్పిన​ ఈ డైలాగ్ మాస్‌కి చాలా నచ్చేసింది. ఇది కూడా పరుచూరి బ్రదర్స్ ఖాతాలోనిదే!

ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. గణేష్ (గణేష్)
వెంకటేష్ నటించిన ‘గణేష్’ చిత్రం అటు మాస్‌నీ, ఇటు క్లాస్‌నీ ఆకట్టుకుంది. ఆయనకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందించింది. ఇందులో ఆయన పలికిన ఈ డైలాగ్ ఆయనకు ట్రేడ్ మార్క్‌గా మారింది. ఇదీ పరుచూరి బ్రదర్స్ కలంలోనుంచి జాలువారిందే!

చంటిగాడు.. లోకల్(ఇడియట్)
రవితేజను స్టార్ హీరోగా మార్చిన చిత్రం ఇది. ఇందులో హీరో క్యారెక్టర్ కొత్తగా ఉండటానికి ప్రధాన బలంగా నిలిచినవి పూరీ జగన్నాథ్ రాసిన సంభాషణలు. అందులో ఈ డైలాగ్ చాలా ప్రాచుర్యం పొంది జనాలకు చంటి పాత్ర చేరువయ్యింది.

లేడీ గెటప్ లో మన హీరోలు..

టాలీవుడ్ హాస్య నటులు అందుకున్న నందులు

హీరోయిన్లకు సాటి హీరోయిన్లు గాత్ర దానం చేసిన వారు వీళ్లే..!

ఎప్పటికీ గుర్తుండిపోయే జయమాలిని ఐటమ్ సాంగ్స్..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...