Sunday, May 5, 2024
- Advertisement -

లలిత జ్యువెలరీస్ అధినేత గురించి మీకు తెలియని నిజాలు

- Advertisement -

ఈ మధ్య కాలంలో ఓ పెద్దయన టీవీ యాడ్స్ లో కనిపిస్తున్నారు. అదేనండి లలిత జ్యువెలరీస్ కు రండి.. డబ్బులు ఆదా చేసుకోండి అంటూ వస్తున్నాడే.. గుర్తొచ్చిందా.. ఆయన ఎవరో అర్టిస్ట్ కాదు.. లలిత జ్యువెలరీస్ అధినేత. ఈయన పెద్దగా చదువుకోలేదు కానీ.. ఆయన యాడ్ లో చెప్పే విషయాలు వింటే ఖచ్చితంగా నమ్మకం కలుగుతోంది. లలిత జ్యువెలరీస్ లోనే ఎందుకు నగలు కొనాలో వివరంగా చెపుతాడు.

అంటే తన సంస్థకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయాడు. పెద్ద పెద్ద బంగారు నగల దుకాణాలకు సవాళ్లు విసురుతాడు. ఇక ఆయన తెలుగు వాడే.. నెల్లూరులో బంగారం అమ్మకం గురించి నేర్చుకున్నాడు. మిడిల్ క్లాస్ నుండి వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా కొన్ని వేల కోట్ల రూపాయలకు అధినేతగా నిలిచాడు. ఒక టైంలో అయితే తినడానికి తిండి లేదు.. వారి కుటుంబీకులు రాజస్థాన్ కు చెందినవారైనప్పటికీ ఆయన మాత్రం తాను నెల్లూరు వాసిననే చెబుతాడు. 10 సంవత్సరాల వయసులోనే బంగారం పనిలోకి కుదిరాడు. రెండు మూడు సంవత్సరాల తర్వాత పని గురించి బాగా తెలుసుకున్నాడు. తన తల్లి దగ్గర ఉన్న గాజులను కిరణ్ కుమార్ తీసుకొని వాటిని కరిగించాడు.

నెల్లూరుకు చెన్నై దగ్గర కాబట్టి అక్కడికి తాను చేసిన ఐటెం 65 గ్రాముల నగను తీసుకొని వెళ్ళి లలిత జ్యువేలర్స్ లో అమ్మేవాడు. అంతకు ముందు వరకూ అతనికి లలిత జ్యువెలర్స్ తో ఎటువంటి సంబంధం ఉండేది కాదు. కేవలం ఇతను చేసిన నగను వారికి అమ్మేవాడు మాత్రమే. అతన్ని లలిత జ్యువెలర్స్ మాత్రమే రిటైల్ వ్యాపారిగా నిలబెట్టింది. ఆ తర్వాత అతను పెద్ద స్థాయిలో బంగారాన్ని ఒక్క లలిత జ్యువేలర్స్ కు మాత్రమే కాకుండా పలు పెద్ద పెద్ద జ్యువెలర్స్ కు నగలను సప్లై చేసేవాడు. అలా ఎదిగాడు కిరణ్ కుమార్. అయితే 1999 లో లలిత జ్యువెలర్స్ మూతబడే టైం వచ్చింది.

ఆ టైంలో ఆయన లలిత జ్యువెలర్స్ ను టేకోవర్ చేశాడు. ఆ తర్వాత లలిత జ్యువెలర్స్ దశ ఒక్కసారిగా తిరిగింది. తమిళనాడులో బిగ్గెస్ట్ జ్యువెలరీ స్టోర్స్ లో ఒకదానిగా లలిత జ్యువెలర్స్ ను నిలిపాడు. వినియోగదారులను నమ్మకంతో పడగొట్టాడు. ఇప్పుడు ఏకంగా 10వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. దాదాపు 1500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇక దేశవ్యాప్తంగా 14 బ్రాంచ్ లకు పెంచాడు. సో పట్టుదల ఉంటే ఎదైన సాధించవచ్చు అని ఇతను నిరుపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -