Sunday, May 19, 2024
- Advertisement -

కేసీఆర్.. అక్కడ అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నాడా!

- Advertisement -

నెలకు ఒక్కసారి మాత్రమే వస్తున్నాడు సెక్రటేరియట్ కు! బహుశా.. వర్తమానంలోనూ.. భూత కాలంలోనూ ఏ రాష్ట్రానికి ఇలాంటి సీఎం ఉండడు కాబోలు! తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఈ తరహాలో వ్యవహరిస్తున్నాడు.

ఆయన నెలకు ఒక్కసారి మాత్రమే సెక్రటేరియట్ వైపు తొంగిచూసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటే దాదాపుగా ప్రతి రోజూ సెక్రటేరియట్ కు వస్తాడు.. పాలనా వ్యవహరాలను పర్యవేక్షిస్తాడు. .అని అనుకొంటాం కానీ.. కేసీఆర్ మాత్రం అలాంటి సీఎం కాదు! 

 

ఆయన ఎక్కువ సేపు తన ఫామ్ హౌస్ లోనే మకాం పెడుతున్నాడు. జిల్లాల పర్యటనకు వెళ్లడం.. హైదరాబాద్ లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే దానికి హాజరు కావడం.. అక్కడ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లిపోవడం. ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరణ తీరు. రాజకీయం అయినా.. పాలన అయినా పామ్ హౌస్ నుంచే కొనసాగిస్తున్నాడాయన. ఈ విషయంలో విమర్శలను లెక్క చేయడం లేదు. అసలు ఆయన సెక్రటేరియట్ కు అడుగుపెట్టిన రోజులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

 

చివరిసారిగా ఈ నెల 24 వ తేదీన కేసీఆర్ సెక్రటేరియట్ కు వచ్చారు.. అంతకు ముందు నెల రోజుಲ క్రితం జూన్ 23 వ తేదీన ఆయన సచివాలయంలో అడుగుపెట్టారు. కొద్ది సేపు ఉండి వెళ్లిపోయారు. ఇలా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రుల వారి తీరు! మరి ముఖ్యమంత్రి సెక్రటేరియట్ వైపు తొంగి చూడకపోవడంతో.. చాలా వరకు పనులకు ఇబ్బంది కలుగుతోందని.. ఫైళ్లు గుట్టలు గుట్టులుగా పడి ఉంటున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ కు ఈ విషయం తెలుసునో లేదో! ఆయనకు ఈ విషయాలు అన్నీ తెలుసనని.. కానీ వాస్తు సరిగా లేదన్న భయంతో సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టడానికి ఆయన భయపడుతున్నాడనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మరి అసలు కథ ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -