Tuesday, April 23, 2024
- Advertisement -

విజయశాంతి నటించిన టాఫ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు..!

- Advertisement -

విజయశాంతి అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌. లేడీ అమితాబ్ అనే స్థాయి ఖ్యాతిని సాధించి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ఆమె చేసిన సినిమాల్లో జనం ఎక్కువగా గుర్తు పెట్టుకునే ఐదు సినిమాల గురించి ఇక్కడ..

నేటి భారతం (1983)
ఒకరకంగా విజయశాంతి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఇది. అప్పటిదాకా గ్లామర్ హీరోయిన్‌గా హీరో సరసన నటించిన ఆమె ఈ చిత్రంలో ప్రభావవంతమైన పాత్రతో జనాన్ని ఆకట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత ఆమెను ప్రధాన పాత్రగా పెట్టి దర్శకులు కథలు రాయడం మొదలుపెట్టారని అంటారు. టి.కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.

ప్రతిఘటన (1985)
విజయశాంతికి హీరోలకు సమానమైన ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది. లెక్చరర్ పాత్రలో సమాజాన్ని ప్రశ్నిస్తూ, చెడదోవ పడుతున్న యువతరాన్ని ఎండగడుతూ పాడే ‘ఈ దుర్యోధన దుశ్శాసన’ పాట శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు ఆమె.

స్వయంకృషి (1987)
అణకువ కలిగిన ఇల్లాలి పాత్రలో విజయం ఒదిగిపోయి నటించిన చిత్రం ఇది. ‘అట్టా సూడమాకయ్యా’ అన్న డైలాగ్ పాపులర్ అయ్యింది. చిరంజీవికి జోడిగా నటించి అద్భుతమైన నటనతో మెప్పించారు.

కర్తవ్యం (1990)
విజయశాంతికి‌ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారం అందించిన సినిమా ఇది. లేడీ‌ పోలీస్ అధికారి పాత్రలో ఆమె నటనకు​ జనం జేజేలు పలికారు. అనేక మంది మహిళలు పోలీసు వృత్తిలోకి రావడానికి ‌ఈ సినిమా స్ఫూర్తినిచ్చింది.

ఒసేయ్ రాములమ్మ (1997)
తెలుగు సినిమా చరిత్రలో ఈ చిత్రం ఓ సంచలనం. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయశాంతి కెరీర్లో మర్చిపోలేని సినిమాగా మిగిలింది. నంది అవార్డ్‌నూ తెచ్చిపెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -