Monday, May 6, 2024
- Advertisement -

వాట్సాప్‌లో కొత్తగా రెండు దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే తెలుసుకోండి

- Advertisement -

త్వరలో వాట్సాప్ లో రెండూ కొత్త ఫీచర్లు యూజర్లను ఆకట్టుకోనున్నాయి. ఒకటి లైవ్ లొకేషన్ షేరింగ్ కాగా, రెండోది ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్. వాట్సాప్ ఉపయోగిస్తున్న యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ను అవతలి వాట్సాప్ యూజర్లకు లేదా వాట్సాప్ గ్రూప్‌నకు షేర్ చేయవచ్చు.

15 నిమిషాలు, 1 గంట లేదా 8 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాట్సాప్ యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ను షేర్ చేయవచ్చు. దీంతో యూజర్లు ఎక్కడ ఉన్నారో వారి ఫ్రెండ్స్‌కు, కుటుంబ సభ్యులకు సులభంగా తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ అమ్మాయిలకు బాగా ఉపయోగపడనుంది. వాట్సాప్ అందజేయనున్న రెండో ఫీచర్ ఏమిటంటే.. యూజర్లు మొబైల్ నంబర్లు చేంజ్ చేసినప్పుడల్లా ఆ విషయాన్ని తెలియజేస్తూ కొత్త మొబైల్ నంబర్‌ను వేరే మార్గాల్లో ఇతరులకు చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు.

వాట్సాప్‌లో రానున్న ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్ ద్వారా యూజర్లు చేంజ్ అయిన తమ మొబైల్ నంబర్ గురించిన నోటిఫికేషన్‌ను అవతలి యూజర్‌కు పంపవచ్చు. దీంతో అవతలి వ్యక్తులకు ఆ సందేశం చేరుతుంది. ఫలానా యూజర్ మొబైల్ నంబర్ చేంజ్ చేశాడని వారికి తెలుస్తుంది. త్వరలోనే ఈ రెండు ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు లభ్యం కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -